తెలుగు ఇండస్రీలో యాక్షన్ హీరోలలో గోపీచంద్ ఒకరు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సీటిమార్ అనే సినిమాలో నటిస్తున్నాడు. క్రీడా నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. అలాగే మారుతీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు గోపీచంద్. అయితే ప్రతిరోజు పండగే వంటి హిట్ సినిమా తర్వాత మారుతీ చేస్తోన్న మూవీ ఇది. అయితే ముందుగా ఈ చిత్రాన్ని రవితేజతో తీయాలనుకున్నాడ మారుతీ. కానీ కొన్ని కారణాల వలన ఆ మూవీ పట్టాలెక్కలేదు. ఇప్పుడు అదే సినిమా కోసం గోపీచంద్‌ను ఫైనల్ చేసాడట. ఇక త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభించాలనికి సన్నహాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
మారుతీ, గోపీచంద్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో హీరోయిన్గా రాశిఖన్నాను తీసుకోవాలని భావించాడట మారుతీ. ఇప్పటికే రాశీఖన్నాతో కలిసి ప్రతిరోజూ పండగే సినిమా తీశాడు మారుతీ. ఇక ఇదే విషయమై హీరో గోపిచంద్‌తో సంప్రదింపులు జరుపగా.. అందుకు గోపీచంద్ ఒప్పుకోలేదట. ఇప్పటికే గోపీచంద్.. రాశీఖన్నాతో కలిసి జిల్, ఆక్సిజన్ వంటి సినిమాల్లో నటించారు. అయితే జిల్ కాస్త మంచి స్పందనను సొంతం చేసుకోగా. ఆక్సిజన్ ప్లాప్ అయింది. దాంతో మళ్ళీ మూడవ సారి కూడా రాశీఖన్నాతో నటించడానికి గోపీచంద్ సిద్దంగా లేడట. దీంతో మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారట దర్శకుడు.
Also Read: