Tollywood: రవీంద్రనాధ్ ఠాగూర్ పాత్రలో ఉన్న ఈ నటుడిని గుర్తుపట్టారా ?.. పాన్ ఇండియా లెవల్లో చాలా ఫేమస్..

పైన ఫోటోను చూశారు కదా.. అందులో రవీంద్రనాథ్ ఠాగూర్ పాత్రలో కనిపిస్తోన్న ఆ నటుడిని గుర్తుపట్టండి. అతను ఒకప్పుడు హీరోగా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ స్టార్ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం హిందీలోనే కాకుండా.. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. గుర్తుపట్టారా ?..

Tollywood: రవీంద్రనాధ్ ఠాగూర్ పాత్రలో ఉన్న ఈ నటుడిని గుర్తుపట్టారా ?.. పాన్ ఇండియా లెవల్లో చాలా ఫేమస్..
Actor

Updated on: Jul 09, 2023 | 9:03 AM

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బయోపిక్స్ హావా నడుస్తోన్న సంగతి తెలిసిందే. గత కొద్ది కాలంగా అన్ని సినీ పరిశ్రమలలో బయోపిక్స్ రూపొందిస్తున్నారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం మరింత ఎక్కువ. వరుసగా ప్రముఖ జీవిత కథలను రూపొందించేపనిలో పడ్డారు మేకర్స్. తాజాగా మరో బయోపిక్ రాబోతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో రవీంద్రనాథ్ ఠాగూర్ పాత్రలో కనిపిస్తోన్న ఆ నటుడిని గుర్తుపట్టండి. అతను ఒకప్పుడు హీరోగా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ స్టార్ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం హిందీలోనే కాకుండా.. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. గుర్తుపట్టారా ?.. అతను ఎవరో.. రవీంద్రనాథ్ ఠాగూర్ పాత్రలో కనిపిస్తోన్న ఆ నటుడు అనుపమ్ ఖేర్. ఇటీవల కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 చిత్రాలతో పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలలో ఆయన పాత్రలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

తాజాగా అనుపమ్ ఖేర్ రవీంద్రనాధ్ ఠాగూర్ లుక్ లో మేకప్ వేసుకున్న ఫోటోను నెట్టింట షేర్ చేశారు. అందులో అచ్చం రవీంద్రనాథ్ ఠాగూర్ లాగే కనిపిస్తున్నారు. అయితే ఈ లుక్ ఆయన ప్రస్తుతం నటిస్తోన్న గురుదేవ్, కవి రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రంలోనిది. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. “గురుదేవ్ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ పాత్రను నా 538వ సినిమాలో పోషించడం చాలా గర్వంగా ఉంది. మరిన్ని వివరాలు త్వరలోనే అనౌన్స్ చేస్తాము” అంటూ ట్వీట్ చేశారు అనుపమ్. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

అయితే అనుపమ్ ఖేర్ షేర్ చేసిన ఫోటో చూస్తుంటే.. బాలీవుడ్ ఇండస్ట్రీలో త్వరలోనే రవీంద్రనాథ్ ఠాగూర్ బయోపిక్ రానున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న ఫోటో చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. అనుపమ్ ఖేర్ డెడికేషన్ చూసి అభినందిస్తున్నారు. ఈ వయసులోనూ ఒక పాత్ర కోసం ఆయన పడుతున్న కష్టం చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.