సూపర్ స్టార్ మహేశ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతున్న వేళ..
వైవిధ్యమైన సినిమాలు తీస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు క్రేజీ డైరెక్టర్ సుకుమార్.
superstar Mahesh fans: వైవిధ్యమైన సినిమాలు తీస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు క్రేజీ డైరెక్టర్ సుకుమార్. అందరిలా కాకుండా తన సినిమాను డిఫరెంట్ యాంగిల్‌లో ప్రజెంట్ చేయడంలో దిట్ట. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నపుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇండస్ట్రీలోని యువ హీరోలందరికి ఈయన హిట్లను అందించాడు. అల్లు అర్జున్‌కు ఆర్య, రామ్‌కు జగడం, నాగచైతన్యకు 100 పర్సంట్ లవ్, ఎన్టీఆర్‌కు నాన్నకు ప్రేమతో, రామ్ చరణ్‌కు రంగస్థలం ఇలా వరుసగా అందరికి విజయాలు అందించాడు.
అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘1-నేనొక్కడినే’ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. కానీ మహేష్ – సుకుమార్ ప్రయత్నాన్ని విమర్శకులు సైతం మెచ్చుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ మరో సినిమా చేయాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. అయితే ప్రస్తుతం మహేశ్ కోసం కథ సిద్ధం చేశాడు సుకుమార్. కథ కూడా వినిపించినట్లుగా మహేశ్ ఓకే అన్నట్లుగా పుకార్లు వస్తున్నాయి. పుష్ప సినిమా తర్వాత ఈ ప్రాజెక్ట్ మొదలవుతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే సుకుమార్‌కు విజయ్ దేవరకొండతో ఒక ప్రాజెక్ట్ ఉంది. కానీ మహేశ్, సుకుమార్ కాంబినేషన్‌లో మాత్రం కచ్చితంగా సినిమా ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే మహేశ్ ఫ్యాన్స్‌కు ఇక పండగే.