బాలీవుడ్‌ యాక్షన్‌ హీరోతో ‘ఘాజీ’ దర్శకుడి తదుపరి మూవీ..!

ఘాజీ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. జలాంతర్గామి కథాశంతో తెరకెక్కిన మొదటి భారతీయ చిత్రం ఇదే కాగా.. ఈ మూవీకి గానూ సంకల్ప్ రెడ్డికి ‌ మంచి పేరు వచ్చింది.

బాలీవుడ్‌ యాక్షన్‌ హీరోతో 'ఘాజీ' దర్శకుడి తదుపరి మూవీ..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 28, 2020 | 6:43 PM

ఘాజీ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. జలాంతర్గామి కథాశంతో తెరకెక్కిన మొదటి భారతీయ చిత్రం ఇదే కాగా.. ఈ మూవీకి గానూ సంకల్ప్ రెడ్డికి ‌ మంచి పేరు వచ్చింది. అంతేకాదు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఆ తరువాత వరుణ్ తేజ్‌తో అంతరిక్షం చిత్రాన్ని తెరకెక్కించారు సంకల్ప్. ఈ మూవీకి విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్దగా విజయాన్ని సాధించలేకపోయింది. ఇదిలా ఉంటే దాదాపు ఏడాదిన్నరగా ఖాళీగా ఉన్న ఈ దర్శకుడు.. ఇప్పుడు మూడో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా బాలీవుడ్‌లోని ఓ యాక్షన్‌ హీరోను సంకల్ప్ డైరక్ట్ చేయబోతున్నారట.

సంకల్ప్ తెరకెక్కించిన ఘాజీ చిత్రాన్ని చూసి ఇంప్రెస్ అయిన నటుడు విద్యుత్ జమ్వాల్ తండ్రి(భారత ఆర్మీ ఆఫీసర్‌) నిజ జీవిత కథల ఆధారంగా ఓ కథను రాయమని అడిగారట. ఈ క్రమంలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో జరిగిన కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా సంకల్ప్ కథను రాశారట. అది విద్యుత్ జమ్వాల్ తండ్రికి నచ్చేయడం, స్క్రిప్ట్‌ కూడా పూర్తి అవ్వడం జరిగిందని తెలుస్తోంది. కరోనా తీవ్రత తగ్గిన తరువాత ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ఇక కథానుగుణంగా ఢిల్లీ, కోల్‌కతా, ముంబయి తదితర ప్రదేశాల్లో ఈ మూవీ షూటింగ్‌ జరగనున్నట్లు టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.