గీతా ఆర్ట్స్‌లో అఖిల్ మూవీ..!

| Edited By:

Feb 16, 2019 | 4:26 PM

హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుసగా హ్యాట్రిక్‌ ఫ్లాప్‌ను ఖాతాలో వేసుకున్నాడు నాగార్జున వారసుడు అఖిల్. మూడు చిత్రాలకు టాలెంట్ ఉన్న డైరక్టర్‌లతోనే పనిచేసినప్పటికీ.. వారెవరు అఖిల్ కెరీర్‌కు బూస్టప్ ఇవ్వలేకపోయారు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు అఖిల్. ఇదిలా ఉంటే మెగా బ్యానర్ గీతా ఆర్ట్స్‌లో అఖిల్ చిత్రం ఉండబోతున్నట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గీతా ఆర్ట్స్‌లో పనిచేసేందుకు దర్శకులు క్యూలో ఉన్నారు. వారిలో కొందరికి అడ్వాన్స్‌లు కూడా ఇచ్చేశారు అల్లు అరవింద్. […]

గీతా ఆర్ట్స్‌లో అఖిల్ మూవీ..!
Follow us on

హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుసగా హ్యాట్రిక్‌ ఫ్లాప్‌ను ఖాతాలో వేసుకున్నాడు నాగార్జున వారసుడు అఖిల్. మూడు చిత్రాలకు టాలెంట్ ఉన్న డైరక్టర్‌లతోనే పనిచేసినప్పటికీ.. వారెవరు అఖిల్ కెరీర్‌కు బూస్టప్ ఇవ్వలేకపోయారు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు అఖిల్. ఇదిలా ఉంటే మెగా బ్యానర్ గీతా ఆర్ట్స్‌లో అఖిల్ చిత్రం ఉండబోతున్నట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

గీతా ఆర్ట్స్‌లో పనిచేసేందుకు దర్శకులు క్యూలో ఉన్నారు. వారిలో కొందరికి అడ్వాన్స్‌లు కూడా ఇచ్చేశారు అల్లు అరవింద్. అందులో గీతా గోవిందం ఫేమ్ పరశురామ్, బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పుడు కథలతో సిద్ధంగా ఉన్నారు. వీరిద్దరిలో ఎవరి కథకు అఖిల్ ఓకే చెప్తే.. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లేలా అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే శ్రీనువైట్ల దర్శకత్వంలో అఖిల్ తదుపరి చిత్రం ఉండబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.