
22 సంవత్సరాల తరువాత ఆ హిట్ పెయిర్ ఎదురుపడ్డారు. రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత వారిద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. కానీ అంతకుముందు ఉన్న స్నేహ బంధం మాత్రం ఇద్దరి మనస్సులో అలాగే ఉండిపోయింది. అందుకే చాలా సంవత్సరాల తరువాత ఎదురుపడ్డ వారికి అప్పటి ఙ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. అంతే నా హీరోయిన్, నా హీరో అంటూ తమ స్నేహ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి వచ్చిన అందరినీ మరిచి తమ ఫ్రెండ్‌షిప్ గురించి మాట్లాడుకున్నారు. నన్ను వదిలేసి 15 సంవత్సరాలు అయ్యింది.. ఇప్పుడు మళ్లీ కనిపించావు అని హీరో అడగ్గా.. ఇప్పటికీ మీరు నాకు మంచి మిత్రులేనంటూ హీరోయిన్ చెప్పుకొచ్చింది. వారే మెగాస్టార్ చిరంజీవి, లేడి సూపర్‌స్టార్ విజయశాంతి. వీరి మాటల్లో కొన్ని పంచ్ డైలాగ్‌లు ఉన్నప్పటికీ.. ఈ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. స్క్రిప్ట్ లేకపోయినా.. సినిమాకు మించిన అద్భుత డైలాగ్‌లు వారి మాటల్లో బయటపడ్డాయి. ఆ వీడియో మీరు చూసేయండి.
Chiranjeevi & Vijayashanti fun moments @ Sarileru Neekevvaru Mega Super Event #Chiranjeevi #Vijayashanti #SarileruNeekevvaruMegaSuperEvent pic.twitter.com/PNEgu78d3v
— TV9 Telugu (@TV9Telugu) January 5, 2020