Samantha Rejected Movies : టాలీవుడ్, బాలీవుడ్ , కోలీవుడ్ లో కలిసి పది సినిమా ఆఫర్స్ ను వదిలేసుకున్న అక్కినేని వారి కోడలు

|

Feb 28, 2021 | 5:56 PM

సమంత అక్కినేని పదేళ్ల క్రితం ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టి.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ చిన్నది. పదేళ్లకు పైగా...

Samantha Rejected Movies : టాలీవుడ్, బాలీవుడ్ , కోలీవుడ్ లో కలిసి పది సినిమా ఆఫర్స్ ను వదిలేసుకున్న అక్కినేని వారి కోడలు
Follow us on

Samantha Rejected Movies : సమంత అక్కినేని పదేళ్ల క్రితం ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టి.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ చిన్నది. పదేళ్లకు పైగా సాగిన సమంత సినీ కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలున్నాయి. తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోలకు జోడీగా నటించిన సమంత పూర్తి పేరు సమన్తా రుతు ప్రభు. మోడలింగ్ రంగం నుంచి సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో బృందావనం, దూకుడు, ఈగ, ఏటో వెళ్ళిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, రంగస్థలం, ఓ బేబీ వంటి అనేక సినిమాల్లో డిఫరెంట్ నేపధ్య పాత్రలతో నటిస్తూ.. స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను సొంతం చేసుకుంది.

28 ఏప్రిల్, 1987 చెన్నైలో జన్మించిన సమంత అక్కినేని నాగార్జున కోడలిగా అడుగు పెట్టింది. మనం సినిమాలో నాగార్జున కు అమ్మగానటించిన సమంత ఆ ఇంటికి కోడలుగా వెళ్లడం విశేషం. 2017లో నాగచైతన్యని ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్ళితర్వాత కూడ సినిమాలలొ నంటించిన నటీమణులు చాలా అరుదు అందులొ ఒకరు సమంత. రేవతి తర్వాత ఒకేసారి అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటి సమంత .

అయితే సమంత తన సినీ కెరీర్ లో చేసిన సినిమాలు దాదాపుగా అన్ని హిట్ అయ్యాయి. అయితే ఆమె కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసింది. ఆమె మొత్తం సినీ కెరీర్ లో దాదాపుగా పది సినిమాలను రిజెక్ట్ చేసింది ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథ చిత్రం కడలి, రామ్ చరణ్ హీరోగా నటించిన ఎవడు, బ్రూస్ లీ, విక్రమ్ శంకర్ కాంబోలో తెరకెక్కిన , నాని హీరోగా వచ్చిన నిన్ను కోరి , హిందీ రీమేక్ మూవీ యూటర్న్ , ఎన్టీఆర్ కథానాయకుడు ఒక పాత హీరోయిన్ గా వచ్చిన ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట.. అంతేకాదు కరణ్ జోహార్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, అశ్విన్ శరవణన్ సినిమాలతో పాటు అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో ఆఫర్ ని కూడా ఈ చెన్నై సోయగం వదిలేసుకుందట..

Also Read:

మా ఆధార్‌ కార్డు మీ వద్ద లేదా.. ఆధార్‌ నెంబర్‌ మర్చిపోయారా.. సింపుల్‌గా తెలుసుకోండిలా..!

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలు.. సంచలన ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్..