
బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ధర్మా ప్రొడక్షన్ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున స్టూడియోలోని గోడౌన్‌లో మంటలు చెలరేగి.. చాలామేర వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సెట్ ప్రాపర్టీస్, కాస్ట్యూమ్స్ కాలిపోయినట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని స్క్రిప్ట్‌లు కూడా దగ్దమైనట్లు సమాచారం.
కాగా 1976లో కరణ్ తండ్రి యశ్ జోహార్ ఈ స్టూడియోను ప్రారంభించారు. ప్రొడక్షన్‌కు సంబంధించిన కెమెరాలు, సెట్ ప్రాపర్టీస్, కాస్ట్యూమ్స్, ఇతర విలువైన వస్తువులను అక్కడే భద్రపరుస్తుంటారు. కాగా ఈ రోజు జరిగిన ప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్తి నష్టంతో పాటు ధర్మా ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రాలకు సంబంధించిన ఎన్నో ఙ్ఞాపకాలు బూడిదైనట్లు తెలుస్తోంది. ఈ బ్యానర్‌పై ఈ ఏడాది తాజాగా రిలీజైన కళంక్, కేసరి వంటి చిత్రాలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.