కరోనా లాక్‌డౌన్: షూటింగ్‌లు అప్పటి నుంచే మొదలుకానున్నాయా..!

| Edited By:

May 05, 2020 | 9:37 AM

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో షూటింగ్‌లకు బ్రేక్ పడ్డ విషయం తెలిసిందే. దీంతో ఎంటర్‌టైన్‌మెంట్ రంగంపై పెద్ద ఎఫెక్ట్ పడింది.

కరోనా లాక్‌డౌన్: షూటింగ్‌లు అప్పటి నుంచే మొదలుకానున్నాయా..!
Follow us on

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో షూటింగ్‌లకు బ్రేక్ పడ్డ విషయం తెలిసిందే. దీంతో ఎంటర్‌టైన్‌మెంట్ రంగంపై పెద్ద ఎఫెక్ట్ పడింది. ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌ నుంచి నిదానంగా కొన్ని కొన్ని రంగాలకు కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలో త్వరలోనే ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి మినహాయింపు ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో జూన్ నుంచి షూటింగ్‌లు ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో దర్శకనిర్మాతలు, నటీనటులు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే థియేటర్లు మాత్రం ఇప్పుడిప్పుడే ప్రారంభం కావని టాక్‌.

కొత్త కేసులు నమోదు కానంతవరకు రాష్ట్రాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగం, పబ్లిక్ రవాణాలను ప్రారంభించకూడదని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీంతో మరో రెండు నెలల వరకు థియేటర్లు ప్రారంభం కావని సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసిన టీవీ చానళ్ల ప్రతినిధులు సీరియల్స్‌ షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వాలంటూ విఙ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

Read This Story Also: దాదాపు లక్ష రూపాయల ‘మద్యం’ కొన్న వ్యక్తి.. వైరల్‌గా మారిన ఫొటో..!