మా నాన్న నన్ను చంపాలనుకుంటున్నాడు: నటి ఆరోపణలు

తన తండ్రి తనను చంపాలనుకుంటున్నాడని నటి తృప్తి శంఖదార్‌ ఆరోపణలు చేశారు. ఈ మేరకు తనకు రక్షణ కల్పించాలంటూ ఆమె పోలీసులను వేడుకున్నారు.

మా నాన్న నన్ను చంపాలనుకుంటున్నాడు: నటి ఆరోపణలు

Edited By:

Updated on: Aug 26, 2020 | 3:55 PM

Actress allegation on Father: తన తండ్రి తనను చంపాలనుకుంటున్నాడని నటి తృప్తి శంఖదార్‌ ఆరోపణలు చేశారు. ఈ మేరకు తనకు రక్షణ కల్పించాలంటూ ఆమె పోలీసులను వేడుకున్నారు. బరేలీకి చెందిన ఈ నటి ఇటీవల తల్లితో కలిసి ఉన్న ఓ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తన ఇష్టానికి వ్యతిరేకంగా తన తండ్రి 28ఏళ్ల వ్యక్తితో పెళ్లి నిశ్చయించారని, అందుకు తాను వద్దనందుకు హత్యాయత్నం చేశారని నటి వెల్లడించారు. అంతేకాదు తనకిచ్చిన నగదును కూడా తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నాడని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తనపై తండ్రి దాడి చేశాడని, తండ్రి నుంచి ప్రాణాలకు ముప్పుందని ఆమె అన్నారు.

మరోవైపు ఈ ఘటనపై బరేలీ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ .. ఇందులో తమకెలాంటి లిఖిత పూర్వక ఫిర్యాదు రాలేదని తెలిపారు. నటి పోస్ట్ గురించి తెలుసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ఇదిలా ఉంటే ఈ ఆరోపణలను తృప్తి తండ్రి, రియల్ ఎస్టేట్ వ్యాపారి రామ్ రతన్ ఖండించారు. కాగా ఈ నటి ఓయ్ ఇడియట్ అనే తెలుగు చిత్రంలో నటిస్తుండగా.. వినాయక చవితి సందర్భంగా ఇటీవల పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్.

Read More:

సాయి పల్లవి విలన్ అవతారం.. ఏ హీరోతో తలపడబోతుందంటే!

సుశాంత్‌కి పోస్ట్‌మార్టం నిర్వహించిన ఆసుపత్రికి షోకాజ్ నోటీసులు