సాయి పల్లవి విలన్ అవతారం.. ఏ హీరోతో తలపడబోతుందంటే!

ప్రేమమ్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు సాయి పల్లవి. ఆమె నటించిన పలు చిత్రాలు పరాజయం అయినప్పటికీ

సాయి పల్లవి విలన్ అవతారం.. ఏ హీరోతో తలపడబోతుందంటే!
Follow us

| Edited By:

Updated on: Aug 26, 2020 | 3:42 PM

Sai Pallavi News: ప్రేమమ్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు సాయి పల్లవి. ఆమె నటించిన పలు చిత్రాలు పరాజయం అయినప్పటికీ., సాయి పల్లవి నటనకు మాత్రం ఇంతవరకు నెగిటివ్ పేరు రాలేదు. ఏ పాత్రలో నటిస్తే, ఆ పాత్రలో ఒదిగిపోయే ఈ నటి కోసం చాలా మంది దర్శకులు ఎదురుచూడనప్పటికీ.. వైవిధ్య సినిమాలు తీసే వారు మాత్రం మొదటి ఆప్షన్‌గా సాయి పల్లవిని పెట్టుకుంటున్నారు. ఆమె అయితేనే తాము రాసుకున్న పాత్రలకు న్యాయం చేయగలదని నమ్ముతుంటారు. ఈ క్రమంలోనే యువ దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్ సాయి పల్లవిలో మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు రెడీ అయ్యారట.

నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్‌, శ్యామ్ సింగరాయ్ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఓ హీరోయిన్‌గా సాయి పల్లవి ఫైనల్ అయిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఆమెది సాధారణ హీరోయిన్ పాత్ర కాదని, విలన్ అని సమాచారం. ఎంతోమందిని పరిశీలించి సాయి పల్లవిని ఎంపిక చేశారని., పాత్ర బావుండటంతో ఆమె ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఇక ఇందుకోసం ప్రస్తుతం ప్రత్యేక మ్యానరిజంపై ఆమె కసరత్తు చేస్తున్నట్ల సమాచారం. ఒకవేళ నిజమైతే సాయి పల్లవిని కొత్త అవతారంలో చూడబోతున్నమాట. అంతేకాదు ఈ పాత్రకు సాయి పల్లవి న్యాయం చేయగలదు అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. కాగా ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్‌లో నటిస్తోన్న నాని.. ఈ మూవీ తరువాత శ్యామ్‌ సింగరాయ్‌లో నటించనున్నారు.

Read More:

సుశాంత్‌కి పోస్ట్‌మార్టం నిర్వహించిన ఆసుపత్రికి షోకాజ్ నోటీసులు

ఫ్లాప్‌ ఇచ్చిన దర్శకుడితో మరోసారి మహేష్‌.. నిజమేనా!

సోషల్ మీడియాలో స్టైల్ మార్చిన లేడీ బాస్ సమంత.! ఫొటోస్ వైరల్.
సోషల్ మీడియాలో స్టైల్ మార్చిన లేడీ బాస్ సమంత.! ఫొటోస్ వైరల్.
పూజాహెగ్డే కు పెళ్లి ఫిక్స్ అయ్యిందా.? వరుడు అతనేనా.?
పూజాహెగ్డే కు పెళ్లి ఫిక్స్ అయ్యిందా.? వరుడు అతనేనా.?
డీమ్యాట్ ఖాతా అంటే ఏమిటి? ఏ పెట్టుబడిదారుడికి ఏది సరైనది?
డీమ్యాట్ ఖాతా అంటే ఏమిటి? ఏ పెట్టుబడిదారుడికి ఏది సరైనది?
ఇందులో ఉన్న మలయాళీ కుట్టిని గుర్తుపట్టగలరా.. ?
ఇందులో ఉన్న మలయాళీ కుట్టిని గుర్తుపట్టగలరా.. ?
జస్ట్ వెయ్యేనా.? ఇంకా పెంచమంటున్న పుష్పరాజ్‌.! బన్నీ నువ్వు కేక..
జస్ట్ వెయ్యేనా.? ఇంకా పెంచమంటున్న పుష్పరాజ్‌.! బన్నీ నువ్వు కేక..
అఫీషియల్.. 'ముంజుమెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
అఫీషియల్.. 'ముంజుమెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
రికార్డును బద్దలు కొట్టడానికి మంచులో నిల్చున్న వ్యక్తి..
రికార్డును బద్దలు కొట్టడానికి మంచులో నిల్చున్న వ్యక్తి..
ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా? మీ కళ్లు బలహీనంగా మారుతున్నట్లే..
ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా? మీ కళ్లు బలహీనంగా మారుతున్నట్లే..
'96' సినిమాలో జాను స్నేహితురాలిగా కనిపించిన ఈ అమ్మాయి గుర్తుందా ?
'96' సినిమాలో జాను స్నేహితురాలిగా కనిపించిన ఈ అమ్మాయి గుర్తుందా ?
ఆ ప్రసాదంతో సంతానం కలుగుతుందని నమ్మకం.. అందుకే
ఆ ప్రసాదంతో సంతానం కలుగుతుందని నమ్మకం.. అందుకే