గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు..? విశ్వక్ ఫైర్..!

| Edited By: Anil kumar poka

Jun 04, 2019 | 1:22 PM

‘అర్జున్ రెడ్డి వర్సెస్ ఫలక్‌నుమా దాస్’ వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా వేదికగా రచ్చరచ్చ అవుతోంది. అయితే.. ఈ వివాదంపై ప్రెస్‌మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చాడు ఫలక్‌నుమా దాస్ హీరో, డైరెక్టర్ విశ్వక్‌ సేన్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తను ఎవరి ఫ్యాన్స్‌ని ఉద్దేశించి అనుచితంగా మాట్లాడలేదని, ఏ హీరోనూ టార్గెట్‌ చేయలేదని అన్నారు. చూడబోతే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుందని పరోక్షంగా హీరో విజయ దేవరకొండ ఫ్యాన్స్‌ను ఉద్ధేశించి వ్యాఖ్యానించాడు. […]

గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు..? విశ్వక్ ఫైర్..!
Follow us on

‘అర్జున్ రెడ్డి వర్సెస్ ఫలక్‌నుమా దాస్’ వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా వేదికగా రచ్చరచ్చ అవుతోంది. అయితే.. ఈ వివాదంపై ప్రెస్‌మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చాడు ఫలక్‌నుమా దాస్ హీరో, డైరెక్టర్ విశ్వక్‌ సేన్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తను ఎవరి ఫ్యాన్స్‌ని ఉద్దేశించి అనుచితంగా మాట్లాడలేదని, ఏ హీరోనూ టార్గెట్‌ చేయలేదని అన్నారు. చూడబోతే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుందని పరోక్షంగా హీరో విజయ దేవరకొండ ఫ్యాన్స్‌ను ఉద్ధేశించి వ్యాఖ్యానించాడు. ఎంతో కష్టపడి మేము ఫలక్‌నుమా సినిమా తీస్తే, హోర్డింగ్‌లు, బ్యానర్‌లు చించేసరికి చాలా బాధేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. నాపై ఎవరో పగబట్టి ఇదంతా చేస్తున్నారని అన్నారు. తన సినిమా గురించి రాసే రివ్యూరైటర్‌ని కానీ, మీడియా గురించి కూడా నేను ఒక్క కామెంట్ కూడా చేయలేదని తెలిపాడు. అసలు ప్రేక్షకులను నేనెందుకు తిడతానని ప్రశ్నించాడు. మూడు రోజుల నుంచి 180 పైరసీ లింక్‌‌లను డిలీట్ చేశామని.. మేము తొలగించినా.. మళ్లీ లింక్‌లు అప్‌లోడ్ చేస్తున్నారని అన్నాడు. నాతో పాటు కష్టపడి పైరసీ లింక్‌లను తొలగించినందుకు ఫిలిం చాంబర్ క్రైమ్‌కు ధన్యవాదాలు తెలిపాడు విశ్వక్ సేన్.