Tollywood : ఒక్క సినిమాతోనే రికార్డులు బ్రేక్.. స్టార్ హీరో కావాల్సినవాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..
ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అప్పట్లో ఆయన నటించిన ప్రేమిస్తే సినిమా కుర్రాళ్లకు పిచ్చెక్కించేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమా ఇప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్. ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్ యువత హృదయాలను కదిలిస్తుంది. ఇక ఈ సినిమాలోని జన్మ నీదేలే సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్, సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాలు ఉన్నాయి. అందులో ప్రేమిస్తే ఒకటి. ఒకప్పుడు కుర్రాళ్లకు పిచ్చెక్కించేసిన సినిమా ఇది. మూవీలోని కథ, కథనంతోపాటు మ్యూజిక్ సైతం సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు భరత్, సంధ్య. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్స్ భరత్ సంధ్య హీరోహీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఈమూవీ విడుదలై దాదాపు 22 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా సరే ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమా వస్తుందంటే చాలు అందరూ కన్నార్పకుండా చూస్తూ ఉంటారు. అంతలా కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. డైరెక్టర్ బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శంకర్ నిర్మించగా.. ఈ సినిమా అప్పట్లో సంచనాలు సృష్టించింది. అప్పట్లో దాదాపు రూ.1.25 కోట్లు ఖర్చయింది. అయితే చివరగా రూ.10 కోట్ల గ్రాస్ సాధించి రికార్డులు తిరగరాసింది. నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది.
ఎక్కువమంది చదివినవి : Aamani: నాకు లైఫ్ ఇచ్చింది ఆయనే.. ఆ హీరోతోనే ఎక్కువ సినిమాలు చేశా.. హీరోయిన్ ఆమని..
తమిళంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ అయ్యాడు హీరో భరత్. ఈ సినిమా తర్వాత భరత్ హీరోగా కొనసాగగా.. పలు చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి. గతంలో ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రేమిస్తే సినిమా అడిషన్స్ గురించి చెప్పుకొచ్చాడు భరత్.ఈ సినిమా అడిషన్ కోసం వెళ్లగా చిన్న టౌన్ లో మెకానిక్ పనిచేసుకునే అబ్బాయిగా నటించాల్సి ఉంటుందని పాత్రను పరిచయం చేశారని.. అందుకు తాను కూడా ఒప్పుకున్నానని చెప్పుకొచ్చారు. అయితే తనను సెలక్ట్ చేసిన తర్వాత హీరోగా తను కరెక్టేనా అనే డైలామాలో డైరెక్టర్ చిక్కుకున్నాడని..దీంతో పక్కా పల్లెటూరి అబ్బాయిలా మెకానిక్ రూల్ కు సెట్ అయ్యేలా ఉండాలని ముఖానికి గ్రీజు పూసుకుని ఆడిషన్ కు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు.
ఎక్కువమంది చదివినవి : Chalaki Chanti: వాడు నా పొట్ట కొట్టాడు.. నాకు అవకాశాలు రాకుండా చేశాడు.. చలాకీ చంటి..
పైగా దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఎలా ఉంటాయో తనకు తెలుసు అని.. వారిలాగే మాట్లాడానని.. దీంతో తన తాపత్రయం నిర్మాతకు అర్థమై వెంటనే స్క్రీన్ టెస్ట్ చేసి ఫైనల్ చేశారని చెప్పుకొచ్చారు. ఈ సినిమాతో తమిళంతోపాటు తెలుగులోనూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు భరత్. ప్రస్తుతం సినిమాల్లో హీరోగానే కాకుండా సహయ పాత్రలు సైతం చేస్తున్నాడు.
ఎక్కువమంది చదివినవి : Eshwar Sai : ఆ టైంలోనే మాధురి నాకు కనెక్ట్ అయ్యింది.. ఆమె చాలా మంచిది.. నోరు విప్పిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర సాయి..
హీరో భరత్ ఫోటో..
View this post on Instagram
ఎక్కువమంది చదివినవి : Comedian Sudhakar: ఒక్క సినిమాకు రూ.30 వేల రెమ్యునరేషన్.. ఆస్తులపై క్లారిటీ ఇచ్చిన నటుడు సుధాకర్..
