AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagrjuna Mass Movie: నాగార్జున ‘మాస్’ మూవీ స్టైలిష్ విలన్ గుర్తున్నాడా? ఇప్పుడెలా మారిపోయాడో మీరే చూడండి

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటించిన సూపర్ హిట్ సినిమాల్లో మాస్ కూడా ఒకటి. 2004లో రిలీజైన ఈ చిత్రం అక్కినేని అభిమానులను బాగా అలరించింది. రాఘవ లారెన్స్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో జ్యోతిక, ఛార్మీ హీరోయిన్లు గా నటించారు. అలాగే రఘువరన్, ప్రకాష్ రాజ్, సునీల్,ధర్మవరపు సుబ్రమణ్యం, వేణు మాధవ్, సత్యం రాజేశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Nagrjuna Mass Movie: నాగార్జున 'మాస్' మూవీ స్టైలిష్ విలన్ గుర్తున్నాడా? ఇప్పుడెలా మారిపోయాడో మీరే చూడండి
Nagarjuna Mass Movie
Basha Shek
|

Updated on: Aug 03, 2024 | 8:54 PM

Share

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటించిన సూపర్ హిట్ సినిమాల్లో మాస్ కూడా ఒకటి. 2004లో రిలీజైన ఈ చిత్రం అక్కినేని అభిమానులను బాగా అలరించింది. రాఘవ లారెన్స్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో జ్యోతిక, ఛార్మీ హీరోయిన్లు గా నటించారు. అలాగే రఘువరన్, ప్రకాష్ రాజ్, సునీల్,ధర్మవరపు సుబ్రమణ్యం, వేణు మాధవ్, సత్యం రాజేశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మాస్ సినిమాలో రఘువరన్ మెయిన్ విలన్ అయినప్పటికీ మూవీ అంతా శేషు పేరే బాగా వినిపిస్తోంది. ఈ పాత్రను పోషించింది ఢిల్లీకి చెందిన రాహుల్ దేవ్. ఇందులో అతను హీరోయిన్ జ్యోతిక కు అన్నయ్యగా కనిపిస్తాడు. విశాఖ పట్నం శేషు పాత్ర మాస్ సినిమాకు పెద్ద అస్సెట్. రఘువరన్ ఉన్నప్పటికీ స్క్రీన్ స్పేస్ మొత్తం రాహుల్ దే. సూపర్ స్టైలిష్ విలన్ గా పేరు తెచ్చుకున్న అతను టాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించాడు. తనదైన విలనిజంతో అదరగొట్టాడు.

నాగార్జున నటించిన ఆకాశ వీధిలో మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు రాహుల్ దేవ్. ఆ తర్వాత మహేశ్ బాబు కౌ బాయ్ సినిమా టక్కరి దొంగలో నటించాడు. సింహాద్రి, సీతయ్య, ఆంధ్రావాలా, నరసింహుడు, అతడు, అల్లరి పిడుగు, జై చిరంజీవ, అస్త్రం, చిన్నోడు, పౌర్ణమి, ఒక్కడున్నాడు, మున్నా, తులసి, లవ్లీ, దమ్ము, షాడో, నాయక్, భాయ్, ఎవడు, లౌక్యం, ఒక్క అమ్మాయి తప్ప, ఇంటిలిజెంట్ తదితర తెలుగు సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు రాహుల్ దేవ్. కేవలం తెలుగులోనే కాదు హిందీ, తమిళ్, కన్నడ ఇండస్ట్రీలోనూ మెరిశాడు. అయితే 2018 తర్వాత పెద్దగా తెలుగు సినిమాల్లో అతను కనిపించలేదు. ప్రస్తుతం హిందీ బెంగాలీ, మరాఠీ చిత్రాలు మాత్రమే చేస్తున్నాడు రాహుల్ దేవ్.

ఇవి కూడా చదవండి

రాహుల్ దేవ్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

సినిమాల సంగతి పక్కన పెడితే.. రాహుల్ దేవ్ 1998లో తన చిన్ననాటి స్నేహితురాలు రీనాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికీ సిద్దార్ధ్ అనే బాబు పుట్టాడు. అయితే ఆమె క్యాన్సర్ తో బాధపడుతూ 2009లో మరణించింది. రాహుల్ దేవ్ ప్రస్తుతం ప్రముఖ బాలీవుడ్ నటి ముగ్ధా గాడ్సేతో ప్రేమలో ఉన్నాడు.

ముగ్దా గాడ్సే తో రాహుల్ దేవ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..