వర్మ ‘దిశ’ను ఆపండి.. హైకోర్టును ఆశ్రయించిన బాధితురాలి తండ్రి

| Edited By:

Oct 10, 2020 | 9:03 AM

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న మరో చిత్రం దిశ ఎన్‌కౌంటర్‌. గతేడాది హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా

వర్మ దిశను ఆపండి.. హైకోర్టును ఆశ్రయించిన బాధితురాలి తండ్రి
Follow us on

RGV Disha movie: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న మరో చిత్రం దిశ ఎన్‌కౌంటర్‌. గతేడాది హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా వర్మ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ఓ ట్రైలర్‌ని కూడా విడుదల చేశాడు. కాగా ఈ మూవీని ఆపేలా కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డును ఆదేశించాలంటూ దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు.. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు శుక్రవారం విచారించారు.

దిశ ఘటన, ఆ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన ఘటనలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ జరుపుతుందని, ఈ నేపథ్యంలో ఈ మూవీ నిర్మాణం చేపట్టడం సరికాదని దిశ తండ్రి తరపు న్యాయవాది, కోర్టుకు తెలిపారు. అయితే ఈ మూవీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్ ఎలాంటి వినతిపత్రం సమర్పించలేదని కేంద్ర ప్రభుత్వం తరపు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్‌ రావు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. దిశ తండ్రి ఇచ్చే వినతిపత్రంపై కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.

Read More:

Bigg Boss 4: మోనాల్‌పై జీరో పర్సంట్ నమ్మకం కూడా లేదన్న అఖిల్‌

Bigg Boss 4: చనిపోయిన నా బిడ్డను భుజంపై వేసుకొని వెళ్లా.. ఏడ్చేసిన గంగవ్వ