ET: స్టార్ హీరోల కంటే ఆ దర్శకులకు ఎక్కువ రెమ్యునరేషన్.. లిస్ట్‌లో ఎవరెవరంటే..?

ఒకప్పుడు డైరెక్టర్లు అంటే కేవలం కథ చెప్పడం, దాన్ని ప్రేక్షకులు మెచ్చే మంచి సినిమాగా రూపొందించడం అన్నట్లుగా ఉండేంది. ప్రమోషన్లలో అయినా, పారితోషికంలో అయినా హీరో, హీరోయిన్లదే హవా నడిచేది. కానీ ఇప్పుడు రోజులు మారాయి. లెక్కలు మారిపోయాయి. పాన్​ఇండియా సినిమాలతో మనదేశంలోనే ..

ET: స్టార్ హీరోల కంటే ఆ దర్శకులకు ఎక్కువ రెమ్యునరేషన్.. లిస్ట్‌లో ఎవరెవరంటే..?
Ss Rajamouli & Sandeepreddy Vanga

Updated on: Nov 21, 2025 | 1:02 PM

ఒకప్పుడు డైరెక్టర్లు అంటే కేవలం కథ చెప్పడం, దాన్ని ప్రేక్షకులు మెచ్చే మంచి సినిమాగా రూపొందించడం అన్నట్లుగా ఉండేంది. ప్రమోషన్లలో అయినా, పారితోషికంలో అయినా హీరో, హీరోయిన్లదే హవా నడిచేది. కానీ ఇప్పుడు రోజులు మారాయి. లెక్కలు మారిపోయాయి. పాన్​ఇండియా సినిమాలతో మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు దర్శకులు.

అంతేకాదు, బాలీవుడ్​ దర్శకుల కంటే దక్షిణాది దర్శకుల హవానే నడుస్తోంది. కథకి అందమైన రూపం ఇవ్వడమే కాదు, పారితోషికంలోనూ తమకే పెద్దపీట కావాలంటున్నారు.‘డైరెక్టర్​ ఈజ్​ ద ఓనర్​ ఆఫ్​ ది షిప్​’ అనే మాటకి కొత్త అర్థం చెబుతున్నారు. స్టార్ హీరోల కంటే ఎక్కువ, అంతకంటే ఎక్కువగా వసూలు చేస్తూ, ‘మా కెపాసిటీ ఇదే’ అని నిరూపిస్తున్నారు.

80 నుంచి 200 కోట్ల వరకు..

దక్షిణ భారతీయ సినిమారంగంలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఎస్.ఎస్.రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్, అట్లీ, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా.. వీళ్లు ఇప్పుడు కేవలం దర్శకులే కాదు, బ్రాండ్లు. వీళ్లు డిమాండ్ చేస్తే నిర్మాతలు ఎంతకైనా ఒప్పుకోవాల్సిందే. ఒక్కో సినిమాకు 80 నుంచి 200 కోట్ల వరకు పారితోషికం, లాభాల్లో షేరు, నిర్మాణ భాగస్వామ్యం, ఓటీటీ-సాటిలైట్ రైట్స్ ఇవన్నీ దర్శకుల ఖాతాలోనే పడుతున్నాయి.

రాజమౌళి ఇప్పటికే పాన్ ఇండియా దిగ్గజంగా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవేదికపై నిలిపారు. ప్రస్తుతం మహేశ్ బాబుతో తీస్తున్న ‘వారణాసి’ (SSMB29) సినిమాకు 200 కోట్లకు పైగానే తీసుకుంటున్నారని టాక్. సుకుమార్ ‘పుష్ప’ సిరీస్‌తో అల్లు అర్జున్‌తో సమానంగా సంపాదించారు. సుక్కు పుష్ప రెండు భాగాలకి సుమారు 100 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’తో 150 కోట్లు పోగేసుకున్నారట. ప్రశాంత్ నీల్ ‘సలార్’, ‘డ్రాగన్’కు ఒక్కొక్కటికీ 100 కోట్లు, అట్లీ ‘జవాన్’తో 100 కోట్లు, నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 AD’తో సుమారు 100 కోట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే డైరెక్టర్ల పారితోషికం జాబితా ఆశ్చర్యం కలిగిస్తోంది.

టాప్​లో టాలీవుడ్​..

హిందీలో మాత్రం ఇంకా ఆ స్థాయి లేదు. రాజ్‌కుమార్ హిరాణీ 80 కోట్లు, సంజయ్ లీలా భన్సాలీ 65 కోట్లు, సిద్ధార్థ్ ఆనంద్ 45 కోట్లు – ఇదే టాప్. అంటే రెమ్యూనరేషన్ పరంగా సౌత్ డైరెక్టర్లదే ఆధిపత్యం. దీనికి కారణం మన దర్శకులు సినిమాను బ్రాండ్‌గా మార్చారు. ప్రేక్షకులు హీరో కోసం కాక, రాజమౌళి సినిమా, సుకుమార్ సినిమా, సందీప్ వంగా సినిమా అని థియేటర్‌కి వస్తున్నారు. దాంతో నిర్మాతలకు ఛాయిస్ లేదు, ఈ డైరెక్టర్ లేకపోతే బడ్జెట్ రికవరీ కష్టం.

అందుకే లాభాల్లో షేరు, నిర్మాణ భాగస్వామ్యం, రైట్స్ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తోంది. ఈ ట్రెండ్ ముందు ముందు మరింత బలపడే అవకాశం ఉంది. ఇకపై స్టార్ హీరోలు కూడా డైరెక్టర్‌ను బట్టి సినిమా సైన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రోజు సక్సెస్ ఫార్ములా ఒక్కటే.. బలమైన దర్శకుడు ఉంటే చాలు, సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది. అందుకే స్టార్ హీరోల కంటే మేమేం తక్కువ కాదు అని ఈ దర్శకులు గట్టిగా చాటుతున్నారు. ఈ రోజు భారతీయ సినిమా ఇండస్ట్రీలో అసలు సూపర్ స్టార్లు మన డైరెక్టర్లే!

Follow Us