Director Trivikram: స్టేజ్‏పైనే ఎమోషనల్ అయిన త్రివిక్రమ్.. ఆ నిర్మాత కాళ్ళు పట్టుకున్న డైరెక్టర్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక ఆయన సినిమాలోనే కాదు బయట ఆయన

Director Trivikram: స్టేజ్‏పైనే ఎమోషనల్ అయిన త్రివిక్రమ్.. ఆ నిర్మాత కాళ్ళు పట్టుకున్న డైరెక్టర్..

Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 13, 2021 | 10:40 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక ఆయన సినిమాలోనే కాదు బయట ఆయన ఇచ్చే స్పీచ్‏కు ఫిదా అయ్యేవాళ్ళు లేకపోలేదు. ఆయన మాటల్లో మ్యాజిక్ ఉంటుంది. అలాగే ఎమోషన్ ఉంటుంది. ఆయన సినిమాల్లో ఉండే డైలాగ్స్ నిజజీవితంలో జరిగే పరిణామాలకు సరిగ్గా కలిసిపోతాయి. అలాంటి డైరెక్టర్ స్టేజీపై భావోద్వేగానికి గురయ్యారు. తాను సినిమా ఇండస్ట్రీలో ఎదగడానికి నిర్మాత గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ నటించిన సినిమా రెడ్. తిరుమల కిశోర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించగా.. మణిశర్మ సంగీతం అందించారు. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకానుంది. దీంతో రెడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‏ను మంగళవారం నిర్వహించారు. ఈ వేడుకకు త్రివిక్రమ్ అతిధిగా విచ్చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన జీవితంలో నిర్మాత స్రవంతి రవికిశోర్.. అంటే హీరో రామ్ పెదనాన్న గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

“స్వయంవరం సినిమా తరవాత నాకు ఎందుకో ఎవరూ సినిమాలు ఇవ్వలేదు. దీంతో భీమవరం వెళ్లి క్రికెట్ ఆడుకుంటుంటే.. నాకు ఫోన్ చేసి అక్కడి నుంచి పిలిపించి నాతో ‘నువ్వే కావాలి’ రాయించారు. సార్.. నేను మీకు ఆ విషయంలో చాలా రుణపడి ఉన్నాను. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాకు నేను పనిచేసినప్పుడు నేను రాసిన ఫైల్ ఆయన దగ్గర పెట్టుకుని రాత్రి 12 గంటలకు నాకు ఫోన్ చేసి ఈ డైలాగ్ ఎంత బాగుంది అని ఆయన చదివి వినిపించేవారు. ఆ సమయంలో నాకు చాలా సంతోషంగా ఉండేది. మేమిద్దరం కలిసి చాలా పెద్ద జర్నీ చేశాం. నాకు సినిమాను ఎంత గౌరవించాలో నేర్పినందుకు నేను మనస్పూర్తిగా రవికిశోర్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను” అంటూ నిర్మాత రవికిశోర్ గురించి చెబుతూ ఆయన కాళ్ళు పట్టుకొని నమస్కారించారు. ఆ సన్నివేశం కనపడిన వెంటనే అభిమానులు హర్షధ్వానులతో మారుమోగింది.

Also Read: