‘సీత’తో మరోసారి తేజ..?

|

Jun 17, 2019 | 7:02 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ తేజ, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మంచి స్నేహితులు. తేజ చిత్రం ‘లక్ష్మీ కళ్యాణం’తో కాజల్ తెలుగు తెరకు పరిచయం కావడంతో.. ఆమెకు ఆయన పట్ల ప్రత్యేక అభిమానం ఉంది. ఇక రీసెంట్‌గా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సీత’ సినిమా బాక్స్‌ఆఫీస్ వద్ద చెప్పుకోదగ్గ  విజయం సాధించలేదు. కానీ నటన పరంగా కాజల్‌కు మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి. అయితే తాజా సమాచారం ప్రకారం మరోసారి ఈ గురుశిష్యులు జతకట్టనున్నారని టాక్. దర్శకుడు […]

సీతతో మరోసారి తేజ..?
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ తేజ, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మంచి స్నేహితులు. తేజ చిత్రం ‘లక్ష్మీ కళ్యాణం’తో కాజల్ తెలుగు తెరకు పరిచయం కావడంతో.. ఆమెకు ఆయన పట్ల ప్రత్యేక అభిమానం ఉంది. ఇక రీసెంట్‌గా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సీత’ సినిమా బాక్స్‌ఆఫీస్ వద్ద చెప్పుకోదగ్గ  విజయం సాధించలేదు. కానీ నటన పరంగా కాజల్‌కు మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి.

అయితే తాజా సమాచారం ప్రకారం మరోసారి ఈ గురుశిష్యులు జతకట్టనున్నారని టాక్. దర్శకుడు తేజ త్వరలో తెరకెక్కించనున్న ఓ లేడి ఓరియెంటెడ్ సినిమాకు హీరోయిన్‌గా కాజల్‌ను ఎంపిక చేశాడట. ఇక ఈ సినిమాకు కాజల్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.