Tollywood : ఆ సినిమా తర్వాత హీరోయిన్‏కు వెండి పళ్లెంలో పట్టు బట్టలు ఇచ్చాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..

ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ అడియన్స్ మెచ్చుకునే చిత్రాలను తెరకెక్కించి తనదైన ముద్ర వేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే హీరోయిన్స్ గురించి మాట్లాడుతూ.. ఒ కథానాయిక పట్ల చూపిన గౌరవాన్ని, చివరి రోజు వెండి పళ్లెంలో పట్టుబట్టలు బహూకరించిన వైనాన్ని వివరించారు.

Tollywood : ఆ సినిమా తర్వాత హీరోయిన్‏కు వెండి పళ్లెంలో పట్టు బట్టలు ఇచ్చాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..
Sv Krishna Reddy

Updated on: Sep 12, 2026 | 9:04 AM

ప్రముఖ దర్శకుడు కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితంలోని రెండు కీలకమైన, భావోద్వేగమైన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఒకటి నటి రమ్యకృష్ణ పట్ల చూపిన అపారమైన గౌరవం, మరొకటి దివంగత నటి సౌందర్య అకాల మరణం తనపై చూపిన తీవ్ర ప్రభావం. ‘ఆహ్వానం’ చిత్రం షూటింగ్‌ సమయంలో రమ్యకృష్ణతో ఉన్న అనుబంధాన్ని దర్శకుడు వివరించారు. ఆమెను ఎంత ఆప్యాయంగా, గౌరవంగా చూసుకునేవారో పంచుకున్నారు. షూటింగ్‌ చివరి రోజున రమ్యకృష్ణ వెళ్ళిపోతున్నప్పుడు, ఆమెకు వెండి పళ్లెంలో పట్టుబట్టలు, పదివేల రూపాయల నగదు, కుంకుమ పెట్టి, బొట్టు పెట్టి సాదరంగా వీడ్కోలు పలికినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ ఊహించని గౌరవానికి రమ్యకృష్ణ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారని దర్శకుడు తెలిపారు. ఈ సంఘటన తనకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుందని, అంతటి మర్యాదను ఆర్టిస్టులకు అందించడం తన సంస్కారంలో భాగమని పేర్కొన్నారు. నేటి వివాదాల నేపథ్యంలో, మనుషుల పట్ల చూపాల్సిన గౌరవం, అనుబంధం ఎంత ముఖ్యమో ఈ ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పుకొచ్చారు.

ఎక్కువమంది చదివినవి : ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్.. చివరకు చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.. ప్రేమ కన్నీళ్లు..

అనంతరం సంభాషణ దివంగత నటి సౌందర్య వైపు మళ్లింది. సౌందర్యను ఒక గొప్ప నటిగా, మంచి వ్యక్తి అని అన్నారు. ఆమె నటన పట్ల తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఒక సందర్భంలో, ఒక సినిమాలో నటించడానికి సౌందర్య మొదట నిరాకరించినా, ఆ తర్వాత తనంతట తానే ఫోన్ చేసి, బాబు మోహన్ పక్కన నటించడానికి అంగీకరించిందని గుర్తు చేసుకున్నారు. ఇది సౌందర్య వృత్తి పట్ల నిబద్ధతను, వ్యక్తుల పట్ల ఆమెకున్న గౌరవాన్ని చాటుతుందని దర్శకుడు పేర్కొన్నారు. ఒక ఆర్టిస్ట్‌ను మనం ఎంత బాగా చూసుకుంటే, వారు అంతగా సహకరిస్తారని, ఇది పరస్పర గౌరవంపై ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Allari Naresh: అతడు ఒక కంప్లీట్ యాక్టర్.. డైలాగ్స్, ఫైట్స్ అన్నీ అద్భుతంగా చేస్తాడు.. అల్లరి నరేష్.

అయితే, సౌందర్య అకాల మరణం తనను తీవ్రంగా కలచివేసింది అన్నారు. సౌందర్య మరణించిన తర్వాత, ఆమె నటించిన సినిమాలు చూడలేకపోయానని, టీవీ స్విచ్ ఆఫ్ చేసేసేవాడినని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణాన్ని ఒక భయంకరమైన విధిరాతగా ఆయన అభివర్ణించారు. సౌందర్య, ఆమె సోదరుడు అగ్ని ప్రమాదంలో దుర్మరణం పాలవడం అత్యంత బాధాకరమైన ఘటన అని తెలిపారు. సౌందర్య ఒక మహానటి అని, అంత మంచి నటిని కోల్పోవడం సినీ ప్రపంచానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. వారి మృతదేహాలు మసైపోతున్నప్పుడు ప్రజలు చూసి తట్టుకోలేకపోయారని, అది ఊహకు కూడా అందనంతటి విషాదమని ఆయన భావోద్వేగంగా పంచుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఏడాదిలో 80 సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్.. ఒక్కో సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్..

రమ్యకృష్ణ..

ఎక్కువమంది చదివినవి : Brahmaji : అన్నం పెట్టిన ఋణం తీర్చుకోవడానికి ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు.. నటుడు బ్రహ్మాజీ..

Loading...
Unable to load recommendations.
Follow Us