సంచలనాలకు మారుపేరు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఎలాంటి కాంట్రవర్సీ లేకపోతే తానే ఓ కాంట్రవర్సీని సృష్టిస్తుంటాడు. ఒకప్పుడు సినిమాలతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన వర్మ ఇప్పుడు.. సోషల్ మీడియాలో ద్వారా నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే రామూయిజంతో యూట్యూబ్ ద్వారా చాలా మందికి చేరువైన వర్మ తాజాగా మరో సరికొత్త యూట్యూబ్ ఛానల్‌కు శ్రీకారం చుట్టారు. నిజం పేరుతో ఛానల్‌ను ప్రారంభిస్తున్నారు. ఈ యూట్యూబ్ ఛానల్‌ను ఏప్రిల్ 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు.
తొలి ఎపిసోడ్‌తోనే సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యారు వర్మ. నిజం ఛానల్‌లో తొలి ఎపిసోడ్‌గా వివేకా హత్య కేసును వర్మ ప్రస్తావించనున్నారు. ఇందులో భాగంగానే ‘రామ్ గోపాల్ వర్మ ప్రెస్ నోట్’ పేరుతో ఓ లేఖను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఇందులో వర్మ.. వివేకా హత్య వెనక నిజం లో , అబద్దముందా ? అనే ఎపిసోడ్ తో నా “నిజం” ఛానల్ ప్రారంభం “నేను ప్రారంభించబోయే ” నిజం” ఛానల్ ముఖ్య ఉద్దేశం అబద్ధాల బట్టలూడదీయడానికి.. ఆ బట్టలూడదీసి విసిరి పారెస్తేనే , నిజం యొక్క పూర్తి నగ్న స్వరూపం బయటపడుతుంది. అబద్ధం బతికేదే నిజాన్ని చంపటం కోసం ప్రయత్నించటానికి .. నిజాన్ని ఎవ్వరూ చంపలేరు. కానీ నిజం అప్పుడప్పుడూ చచ్చిపోయినట్టు నటిస్తుంది. .. దానికి మోసపోయి ,చచ్చింది అని అబద్ధాలు చెప్పే వాళ్ళు సంబరం తో డాన్స్ లాడు తూండగా ఏదో ఒక రోజు వెనక నుంచి ముందు పోటు పొడుస్తుంది’ అంటూ రాసుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..