Ram Gopal Varma: సిరివెన్నెల అంత అద్భుతంగా పాటలు ఎలా రాశారో తెలుసా.? ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు..

Ram Gopal Varma: సాహితీ లోకంలో ఎప్పటికీ చెరిగిపోని సంతకం చేశారు రచయిత సిరి వెన్నెల సీతారామా శాస్త్రి. అలాంటి గొప్ప సాహితీవేత్త మరణ వార్త విన్న ఆయన అభిమానులు ఒక్కసారి షాక్‌కి గురయ్యారు...

Ram Gopal Varma: సిరివెన్నెల అంత అద్భుతంగా పాటలు ఎలా రాశారో తెలుసా.? ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు..
Ramgopal Varma

Updated on: Dec 05, 2021 | 7:57 AM

Ram Gopal Varma: సాహితీ లోకంలో ఎప్పటికీ చెరిగిపోని సంతకం చేశారు రచయిత సిరి వెన్నెల సీతారామా శాస్త్రి. అలాంటి గొప్ప సాహితీవేత్త మరణ వార్త విన్న ఆయన అభిమానులు ఒక్కసారి షాక్‌కి గురయ్యారు. సామాన్య అభిమానులతో పాటు తోటి సినీ కళాకారులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇలా సిరివెన్నెలకు ఉన్న అశేష అభిమానుల్లో దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఒకరు. సంతోషం, బాధ లాంటి ఫీలింగ్స్‌ను పెద్దగా బయటపెట్టడానికి ఆసక్తి చూపించని వర్మ.. సిరివెన్నల విషయంలో మాత్రం అతని భావాలను దాచుకోలేకపోతున్నారు. సిరివెన్నెల లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్న వర్మ.. అతని గురించి వరుస ట్వీట్లు చేస్తున్నాడు. సిరివెన్నెలకు మరణం లేదంటూ ఇప్పటికే ఓ ట్వీట్ చేసిన ఆర్జీవీ తాజాగా మరో ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు.

5 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో వర్మ, సిరివెన్నెల సీతారామా శాస్త్రి గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. సిరివెన్నెల అంత అద్భుతంగా పాటలు రాయడానికి ఆయన ఆలోచన, సమాజంపై అతనికి ఉన్న అవగాహనే కారణమని వర్మ చెప్పుకొచ్చారు. ఇక సిరివెన్నెల రాసిన పాటల్లో తనకు అత్యంత ఇష్టమైన పాట.. ‘ఎప్పుడూ ఓప్పు కోవ‌ద్దు రా.. ఓట‌మి’ అని తెలిపారు. అంతటితో ఆగకుండా వర్మ తనదైన స్టైల్‌లో పాటను పాడారు కూడా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సిరివెన్నెలపై ఆర్జీవీకి ఉన్న అభిమానానికి ఈ వీడియో అద్దం పడుతుందని ఆయన ఫ్యాన్స్‌ అంటున్నారు.

Also Read: Reliance Jio: యూజర్లకు జియో గుడ్‌ న్యూస్‌.. ప్రీపెయిడ్‌ రీచార్జ్‌లపై 20 శాతం క్యాష్‌ బ్యాక్‌.. పూర్తివివరాలు..

US – Sirivennela : ఇలాంటి ఒక రోజు వస్తుందని ఊహించలేదు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రికి తెలుగు ఎన్నారైల ఘన నివాళి..

Marriage: పెళ్లికి ముందు ప్రతి అమ్మాయి తన భాగస్వామిని ఈ 3 విషయాలు తప్పక అడగాలి.. అవేంటంటే..