RGV: మరో వివాదాన్ని ముందేసుకున్న వర్మ.. ‘కొవిడ్‌ ఫైల్స్‌’ పేరుతో ప్రభుత్వాలపై అటాక్‌ చేసేందుకు సిద్ధం..

|

Jul 22, 2022 | 6:35 AM

RGV: సంచలనాలకు మారు పేరు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. ఎక్కడ కాంట్రవర్సీ ఉంటే అక్కడ వర్మ ఉంటాడు. వర్మ తిండి లేక పోయినా ఉంటాడేమో కానీ నిత్యం వార్తల్లో ఉండకుండా మాత్రం ఉండడు...

RGV: మరో వివాదాన్ని ముందేసుకున్న వర్మ.. కొవిడ్‌ ఫైల్స్‌ పేరుతో ప్రభుత్వాలపై అటాక్‌ చేసేందుకు సిద్ధం..
Follow us on

RGV: సంచలనాలకు మారు పేరు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. ఎక్కడ కాంట్రవర్సీ ఉంటే అక్కడ వర్మ ఉంటాడు. వర్మ తిండి లేక పోయినా ఉంటాడేమో కానీ నిత్యం వార్తల్లో ఉండకుండా మాత్రం ఉండడు. ఆయన గురించి తెలిసిన ఎవరైనా ఇదే అనుకుంటారు. ఇక ఎక్కడ ఏ కాంట్రవర్సీ లేకపోతే ఓ చిన్న ట్వీట్‌తోనైనా అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటాడు. ఇప్పటికే ఎన్నో యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కించి అలజడి సృష్టించిన వర్మ తాజాగా మరో వివాదాన్ని ముందేసుకున్నాడు. ‘కొవిడ్‌ ఫైల్స్‌’ పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు.

స్వయంగా ట్విట్టర్‌ వేదికగా వర్మ ఈ విషయాన్ని తెలిపాడు. కరోనా సమయంలో దేశంలో ఎదురైన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ట్విట్టర్‌ వేదికగా కొన్ని ఫొటోలను పోస్ట్‌ చేస్తూ వరుస ట్వీట్స్‌ చేశాడు. ఈ సందర్భంగా వర్మ ట్వీట్ చేస్తూ.. ‘కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వెనుక ఉన్న కుట్రదారు కరోనా వైరస్‌ కాదు. అధికార యంత్రంగంలో ఉన్న నిర్లక్ష్యం. దీనిని ‘కొవిడ్‌ ఫైల్స్‌’ నిరూపిస్తుంది. లక్షలాది ప్రాణం కోల్పోవడానికి కారణమైన అవినీతి, నిర్లక్ష్య యంత్రాంగాన్ని ఈ సినిమా బట్టయలు చేయనుంది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాలో చూపించే నిజాలు ఓటర్లలో ఆగ్రహం తెప్పిస్తుంది. వచ్చే ఎన్నికాల్లో ప్రభావం చూపిస్తుంది’ అని రాసుకొచ్చారు. దీంతో వర్మ పెద్ద కాంట్రవర్సినే నెత్తికెక్కించుకున్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమాలో ఎవరు నటిస్తారు.? ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుంది.?లాంటి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..