Krish- Vaishnav Tej : ‘ఉప్పెన’ సినిమాతో సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. బూచి బాబు సాన దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా విడుదలకాకముందే టాప్ డైరెక్టర్ క్రిష్ తో ఓ సినిమా చేసాడు వైష్ణవ్. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో ఈ సినిమాను పూర్తి చేసాడు క్రిష్. ఈ మూవీలో వైష్ణవ్ కు జోడీగా అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు కొండపొలం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.
కొండపొలం అనే నవల ఆధారంగా వస్తోన్న ఈ చిత్రాన్ని క్రిష్-రాజీవ్ రెడ్డి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ‘ఉప్పెన’ సినిమా మంచి విజయం సాధించడంతో క్రిష్ సినిమాపైనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీగానే జరుగుతుందని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదల అవుతుందని గతంలో వార్తలు హల్ చల్ చేసాయి. మరి ఇప్పడు థియేటర్స్ ఓపెన్ అయ్యాయి పైగా 100 శాతం సీటింగ్ కెపాసిటీకి కూడా అనుమతులు లభించాయి. మరి ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారా లేక థియేటర్స్లో విడుడుదల చేస్తారో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :
రోడ్డు ప్రమాదంలో నా అన్న, తండ్రిని కోల్పోయాను.. ఆవేదన వ్యక్తం చేసిన నందమూరి స్టార్ హీరో..