NTR-Koratala: 2018లో వచ్చిన ‘అరవింద వీర రాఘవ’ సినిమా తర్వాత ఎన్టీఆర్ మళ్లీ వెండితెరపై కనిపించలేదు. ఇలా ఈ సినిమా పూర్తికాగానే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆర్.ఆర్.ఆర్‌లో పాల్గొన్నాడు ఎన్టీఆర్. అయితే కర్ణుడి చావుకు వేయి కారణాలు అనట్లు ఆర్ఆర్ఆర్ విడుదలను ఎన్నో కారణాలు అడ్డుకున్నాయి. మొదట్లో కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వస్తే, తాజాగా థార్డ్ వేవ్ సినిమా విడుదలకు అడ్డుకుంది. దీంతో వేసవికే సినిమాను తీసుకొచ్చేందుకు జక్కన్న సిద్ధమయ్యారు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఇప్పటికే కొరటాలతో ఓ సినిమా స్టార్ట్ చేయాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఆచార్య సినిమా కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ప్రస్తుతం ఆచార్య చివరి దశకు చేరుకోవడం, ఎన్టీఆర్ కూడా ఖాళీగా ఉండడంతో వీరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాపై అడుగులు ముందుకు పడ్డాయి. దీంతో ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందు తన కొత్త సినిమాను ప్రారంభించే పనిలో పడ్డారంటా ఎన్టీఆర్. ఇటు కొరటాల శివ కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులను ప్రారంభించారని సమాచారం. వచ్చే నెలలో సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్న కొరటాల ఆ దిశగా ఇప్పిటికే అడుగులు వేశారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్, ఇతర కీలక నటీనటులను ప్రకటించడానికి కసరత్తులు మొదలు పెట్టారు. జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వీరిద్దరి కాంబినేషనల్‌లో వస్తోన్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా పూర్తికాగానే ఎన్టీఆర్ కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నవిషయం తెలిసిందే.
Also Read: Drones Bans: అబుదాబి దాడులతో అప్రమత్తమైన ప్రభుత్వం.. డ్రోన్లపై నిషేధం..!
KTR Letter: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ.. ఎందుకోసమంటే..?
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ ఖాళీకి మోక్షమెప్పుడు.. ఈటల స్థానం కోసం నేతల మధ్య పోటీ!