మహేష్‌తో ఈ జర్నీ.. జీవితాంతం గుర్తుపెట్టుకుంటా: అనిల్ రావిపూడి

మహేష్‌తో ఈ జర్నీని జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ పొద్దునే తనకు కొడుకు పుట్టానని.. సాయంత్రం ఇంత పెద్ద ఈవెంట్‌ జరుగుతుందని.. ఇలాంటి ఓ రోజు నెవ్వురు బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అని చెప్పుకొచ్చాడు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రత్యేక కృతఙ్ఞతలని చెప్పుకొచ్చారు. చిరంజీవి వల్లనే ఈ ఫీల్డ్‌కు వచ్చానని.. ఆయన వలనే తనలో […]

మహేష్‌తో ఈ జర్నీ.. జీవితాంతం గుర్తుపెట్టుకుంటా: అనిల్ రావిపూడి

Edited By:

Updated on: Jan 05, 2020 | 10:07 PM

మహేష్‌తో ఈ జర్నీని జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ పొద్దునే తనకు కొడుకు పుట్టానని.. సాయంత్రం ఇంత పెద్ద ఈవెంట్‌ జరుగుతుందని.. ఇలాంటి ఓ రోజు నెవ్వురు బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అని చెప్పుకొచ్చాడు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రత్యేక కృతఙ్ఞతలని చెప్పుకొచ్చారు. చిరంజీవి వల్లనే ఈ ఫీల్డ్‌కు వచ్చానని.. ఆయన వలనే తనలో ఉన్న కళలకు బీజం పడిందని అనిల్ తెలిపారు. ఈ సినిమాలో సూప‌ర్‌స్టార్ కృష్ణ‌గారు కూడా ఉంటారు. ఆయ‌నెలా ఉంటార‌నేది సినిమాలో చూడాల్సిందేనని అనిల్ చెప్పుకొచ్చారు.

‘‘ఎఫ్ 2 షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు మ‌హేశ్‌గారికి ఈ క‌థ చెప్పాను. క‌థ విని.. సినిమా చేస్తున్నామ‌ని చెప్పిన క్ష‌ణాలు.. ఫిబ్ర‌వ‌రిలో పిలిచి సినిమా క‌థ చేయ‌మ‌ని చెప్పిన క్ష‌ణాలు. జూలై నుండి ఇప్ప‌టి వ‌ర‌కు నేను ఆయ‌న‌తో చేసిన ప్ర‌తి క్షణం నా జీవితంలో నేను గుర్తు పెట్టుకునే ఉంటాను. నాకు పెద్ద అవ‌కాశం ఇచ్చారు. ఆయ‌న నాకు ఏమిచ్చారు అనేదానికి రేపు జ‌న‌వ‌రి 11న మంచి హిట్ ఇచ్చి తిరిగి ఇవ్వాల‌ని అనుకుంటున్నాను. సినిమా బాగా వ‌చ్చింది. జ‌న‌వ‌రి 11న బొమ్మ ద‌ద్ద‌రిల్లిపోతుంది’’ అన్నారు.