Mangalavaram: 45 నిమిషాలు ట్విస్టులే ట్విస్టులు.. ‘మంగళవారం’ గురించి ఆసక్తికర విషయాలు..

ఈ చిత్రాన్ని నవంబర్ 17వ తేదీన విడుదల చేయనున్నారు. సినిమా విడుదల దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే తాజాగా దర్శకుడు అజయ్‌ భూపతి హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మంగళవారం చిత్రాన్ని చూసి ప్రజలు తప్పకుండా...

Mangalavaram: 45 నిమిషాలు ట్విస్టులే ట్విస్టులు.. మంగళవారం గురించి ఆసక్తికర విషయాలు..
Mangalavaram Movie

Updated on: Nov 13, 2023 | 6:50 PM

పాయల్‌ రాజ్‌పుత్ లీడ్‌ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘మంగళవారం’. అజయ్‌ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో ఆర్‌ఎక్స్‌ 100 తర్వాత వస్తున్న చిత్రం కావడంతో క్యూరియాసిటీ నెలకొంది. ఆర్‌ఎక్స్‌ 100 తర్వాత అటు అజయ్‌కి, ఇటు పాయల్‌కి సరైన విజయం దక్కలేదు. దీంతో అజయ్‌ భూపతి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించాడు.

ఈ చిత్రాన్ని నవంబర్ 17వ తేదీన విడుదల చేయనున్నారు. సినిమా విడుదల దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే తాజాగా దర్శకుడు అజయ్‌ భూపతి హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మంగళవారం చిత్రాన్ని చూసి ప్రజలు తప్పకుండా షాక్‌ అవుతారని అజయ్‌ చెప్పకొచ్చారు. గ్రామీణ నేపథ్యంలోసాగే మిస్టీరియస్‌ థ్రిల్లర్‌ తెరకెక్కించిన ఈ సినిమా ఎక్కువ శాతం నైట్‌ షూట్స్‌లో చేసినట్లు తెలిపారు.

సినిమాలో మ్యూజిక్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందన్న అజయ్‌.. అజనీష్‌ లోక్‌నాథ్‌ అద్భుతైన మ్యూజిక్‌ను అందించినట్లు తెలిపారు. ముఖ్యంగా ‘గణగణ మోగాలి’ పాటకు పూనకాలు వస్తాయనని చెప్పుకొచ్చారు. ఇక మంగళవారం చిత్రాన్ని ఎలాంటి అంచనాలు, అపోహలు లేకుండా ఓపెన్‌ మైండ్‌తో చూడాలన్న అజయ్‌.. సినిమాలో ప్రేక్షకులు షాకయ్యే అంశాలు చాలా ఉంటాయన్నారు. ఫస్టాప్‌లో వచ్చే ఎన్నో ప్రశ్నలకు, సెకాండాఫ్‌లో వచ్చే సన్నివేశాలకు ప్రేక్షకులు షాక్‌ అవుతారన్నారు.

మంగళవారం ట్రైలర్..

మరీ ముఖ్యంగా సినిమా చివరి 45 నిమిషాలు అద్భుతమైన ట్విస్ట్‌లు ఉంటాయని అజయ్‌ భూపతి చెప్పుకొచ్చారు. ఈ 45 నిమిషాలు సీట్లో నుంచి లేవాలనిపించదన్నారు. ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారన్నారు. ఇక ఏడాదిన్నర క్రితమే ఈ సినిమా కథను అల్లు అర్జున్‌ విన్నారన్న అజయ్‌.. బన్నీకి కథ ఎంతగానో నచ్చిందని, సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారన్నారు. మరి ఇన్ని అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..