Tollywood: ఓరి దేవుడా.. ఈ అమ్మాయి కట్టప్ప కూతురా..? ఇంత అందంగానా..?

సత్యరాజ్ కుమార్తె దివ్య ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. మత్తు ఎక్కించే చూపుతుతో కవ్విస్తున్న ఆమె పిక్స్ చూసిన నెటిజన్స్ 'హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోదు' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ దివ్య ఏం చేస్తుంది. ఆమెకు సినిమాలపై ఆసక్తి ఉందా..? ఏమైనా సినిమాల్లో నటించిందా..? తెలుసుకుందాం పదండి...

Tollywood: ఓరి దేవుడా.. ఈ అమ్మాయి కట్టప్ప కూతురా..? ఇంత అందంగానా..?
Sathyaraj Daughter
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 26, 2024 | 9:12 AM

నటుడు సత్యరాజ్‌ సౌత్ ఇండియాలో సూపర్ పాపులర్. ఒకప్పుడు తమిళ్ ఇండస్ట్రీలో ఆయన దుమ్మురేపారు. వయస్సు పైబడటంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ అయ్యారు. తెలుగులో ఆయన్ను ఒరిజినల్ పేరుతో.. కంటే కట్టప్ప అని పిలిస్తేనే గుర్తుపడతారు. బాహుబలి సినిమాలో కట్టప్పగా ఆయన విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయనకు చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కుతూ వస్తున్నాయి. ముఖ్యంగా హీరోలకు తండ్రి పాత్రల్లో ఆయన చక్కగా ఒదిగిపోతారు. ఇంత ఇమేజ్ ఉన్న నటుడు అయిన సత్యరాజ్ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. సినిమాల్లో తప్పితే.. మీడియా, సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్‌గా కనిపించరు. ఇక ఆయన వ్యక్తిగత జీవితం గురించి కూడా చాలామందికి తెలీదు. సత్యరాజ్‌ ఫ్యామిలీ విషయానికి వస్తే.. భార్య మహేశ్వరి, ఒక తనయుడు, కుమార్తె ఉన్నారు.

ఇప్పటికే సత్యరాజ్ కొడుకు సిబిరాజ్‌ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. డోరా, మాయోన్‌ వంటి చిత్రాల్లో నటించి తన ప్రతిభ చాటుకున్నాడు. ఇక ఆయన కుమార్తె పేరు దివ్య సత్యరాజ్‌. ప్రస్తుతం ఆమె ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇండస్ట్రీకి దూరంగా ఉండే దివ్య.. న్యూట్రిషనిస్ట్‌గా పని చేస్తోంది. అంత స్టార్ యాక్టర్ కూతురు అయినప్పటికీ.. ఆమె మీడియాలో పెద్దగా కనిపించదు.  సోషల్‌ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆరోగ్యం, జీవనశైలిపై నెటిజన్లకు సలహాలు, సూచనలు ఇస్తుంది. దీంతో ఆమెకు ఫాలోవర్స్ సంఖ్య బాగా ఉంది. ఇక దివ్య ఫోటోలు లేటెస్ట్‌గా చూసిన నెటిజన్స్.. ఆమెది హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని అందం అంటూ ప్రశంసిస్తున్నారు. కాగా దివ్య మహిళ్‌మతి ఇయక్కం పేరుతో  స్వచ్ఛంద సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆమెకు రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు సమాచారం.

Divya

Divya

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..