ధనాధన్ ప్రొడక్షన్.. దూకుడు యాక్షన్.. ఇప్పుడిదే ఇంట్రెస్టింగ్ టాపిక్. క్రికెట్ గ్రౌండ్‌లో ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన మహేంద్ర సింగ్ ధోని సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారనే వార్త దక్షిణాది మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మిస్టర్ కూల్ ప్రొడక్షన్ రంగంలోకి దిగడం ఖాయం. మరి మహేష్ హీరోగా కన్‌ఫామ్ అయ్యారా లేదా అన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది. ధోనీ క్రేజీనే వేరే లెవెల్.. సందర్భం ఏదైనా, వేదిక ఎక్కడైనా అదే సౌండూ.. అంతే రీసౌండూ.. అయితే సినీ ఇండస్ట్రీలోకి క్రికెటర్స్ రావడం కొత్తకాదు. ఇప్పటికే చాలామంది దిగ్గజ క్రికెటర్స్ సినిమాలు చేశారు. ఇప్పుడు మరో దిగ్గజం చిత్రపరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. అయితే అది హీరోగా కాదు నిర్మాతగా. ఎంఎస్ ధోని.. తన బ్యానర్‌లో సౌత్ భాషల్లో సినిమాలు తీసే ఆలోచనలో ఉన్నాడు.
తెలుగులో మహేశ్ బాబు, తమిళంలో దళపతి విజయ్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ బలంగా నడుస్తుంది. ఈ లెక్కన మహేష్ – ధోని సినిమా అంటే.. ఎలా ఉండబోతుందోనని క్లారిటీ రాకముందే ఫ్యాన్స్ ఎక్సయిట్ అవుతున్నారు. సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా ధోనీ.. మహేశ్‌ని కాంటాక్ట్ కాలేదు. ఒకవేళ అడిగినా మహేశ్ కాదనలేడన్న వాదనలూ ఉన్నాయి. 2011 వన్డే ప్రపంచకప్‌లో సిక్సర్ బాది భారత్‌కు ప్రపంచకప్ అందించిన ఉద్వేగభరితమైన దృశ్యానికి సంబంధించిన పోస్టర్ షేర్ చేస్తూ.. ఆ ఐకానిక్ సిక్సర్‌ను ఎలా మరచిపోగలం. ఆ సన్నివేశాలు తలచుకుంటే గర్వంగా ఉందంటూ గతంలో మహేష్ ట్వీట్ చేశారు. ఇక ధోనీ అడగడమే ఆలస్యం ప్రిన్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఇప్పటికే రోర్ ఆఫ్ లయన్, బ్లేజ్ టు గ్లోరీ, ద హిడెన్ హిందూ అనే మూడు షార్ట్ ఫిల్మ్‌లను రూపొందించారు. ధోనీ భార్య సాక్షి నిర్మాణ బాధ్యతలు వహించారు. ఇకపై భారీ స్థాయిలో సౌత్ స్టార్స్‌తో సినిమాలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు ధోనీ. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత రాజమౌళి కాంబినేషన్‌లో మరో సినిమా ఉంది. మరి ధోనీతో కమిట్ అయితే ఆ సినిమా ఎప్పుడు ఉంటుంది..? స్టోరీ ఎలా ఉంటుంది? డైరెక్టర్ ఎవరన్న ఊహాగానాలు ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.