Danush: ‘గుర్రం, ఏనుగు, కుక్క, కత్తి’… ఆసక్తి రేకెత్తిస్తోన్న ధనుష్‌ కొత్త చిత్రం టీజర్‌..

|

Jan 31, 2021 | 6:40 PM

Dhanush karnan Teaser Out: సినిమా ఏంపికలో వైవిధ్యత, నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు తమిళ హీరో ధనుష్‌. ఓ వైపు కమర్షియల్‌ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ..

Danush: గుర్రం, ఏనుగు, కుక్క, కత్తి... ఆసక్తి రేకెత్తిస్తోన్న ధనుష్‌ కొత్త చిత్రం టీజర్‌..
Follow us on

Dhanush karnan Teaser Out: సినిమా ఏంపికలో వైవిధ్యత, నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు తమిళ హీరో ధనుష్‌. ఓ వైపు కమర్షియల్‌ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై తనదైన ముద్ర వేశాడీ యంగ్‌ హీరో.
ధనుష్‌ హీరోగా ప్రస్తుతం ‘కర్ణన్‌’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ మొదలైంది. కలైపులిథాను నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా ఒక ఊరినే నిర్మించారంటేనే ఈ చిత్రాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్‌ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. 1.28 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్‌ అద్యంతం ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు ఈ సినిమాలో ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియజేయడానికి కొన్ని క్లూలు ఇచ్చినట్లు అర్థమవుతోంది. టీజర్‌ మొదలవగానే ఒక గుర్రం, ఏనుగు, కుక్కను చూపించి.. అనంతరం చేతిలో కత్తిపట్టుకున్న ధనుష్‌ ఎంట్రీ ఆసక్తికరంగా ఉంది. దీంతో సినిమా ఏ అంశంపై ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. పీరియాడికల్‌ డ్రామాగా కనిపిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయనున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి సంచలనాలకు తెరతీస్తుందో చూడాలి.

Also Read:
OTT Platform: ఓటీటీకి షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం.. కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్..
Geetha Arts Tweet: ‘బస్తీ బాలరాజు’ వచ్చేస్తున్నాడు.. సినిమా తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్‌..