మరోసారి హాలీవుడ్ సినిమాలో నటించనున్న స్టార్ హీరో.. అమెరికాకు పయనమైన సూపర్ స్టార్ అల్లుడు..
మరోసారి హాలీవుడ్ సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడు తమిళ స్టార్ హీరో ధనుష్. ఇప్పటికే ధనుష్.. 'ది ఎక్స్ ట్రార్టినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్'
మరోసారి హాలీవుడ్ సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడు తమిళ స్టార్ హీరో ధనుష్. ఇప్పటికే ధనుష్.. ‘ది ఎక్స్ ట్రార్టినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ అనే ఇంగ్లీష్ సినిమాలో ధనుష్ కీలకపాత్రలో నటించాడు. ఈ మూవీ తర్వాత మరోసారి హాలీవుడ్ వైపు అడుగులేస్తున్నాడు ధనుష్. ఇందుకోసం రెండు నెలలపాటు అమెరికాకు మాకం మార్చనున్నారు ఈ స్టార్.
అవెంజర్స్, ఎండ్ గేమ్ సినిమాలను తెరకెక్కించిన దర్శక ద్వయం రుస్సో బ్రదర్స్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ధనుష్ కీలకపాత్రలో నటించనున్నాడు. ఈ చిత్రానికి ‘ది గ్రే మ్యాన్’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లుగా సమాచారం. ఫుల్ యాక్షన్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుంది. ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఈవెన్స్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. వీరిద్ధరి సినిమాలో ధనుష్ ఓ కీలకపాత్రలో నటించనున్నాడు. ఈ నెలలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుండడంతో.. ధనుష్ అమెరికాకు పయనమయ్యాడు. దాదాపు రెండు నెలలు అక్కడే ఉండి.. ఆ సినిమా చిత్రీకరణ అనంతరం తిరిగి ఇండియాకు రానున్నారు.
Also Read: