Dhanush And Aishwaryaa: విడాకుల ప్రకటన తర్వాత బిజీగా మారిపోయిన ధనుష్, ఐశ్వర్య.. ఏం చేస్తున్నారంటే..

18 ఏళ్ల వైవాహిక బంధానికి(Separation) వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), రజనీకాంత్ కూతురు ఐశ్వర్య(Aishwaryaa) .

Dhanush And Aishwaryaa: విడాకుల ప్రకటన తర్వాత బిజీగా మారిపోయిన ధనుష్, ఐశ్వర్య.. ఏం చేస్తున్నారంటే..

Updated on: Jan 25, 2022 | 9:32 AM

18 ఏళ్ల వైవాహిక బంధానికి(Separation) వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), రజనీకాంత్ కూతురు ఐశ్వర్య(Aishwaryaa) . తాము విడిపోతున్నట్లు  కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా వేర్వేరు ప్రకటనలు చేశారీ మాజీ కపుల్.  అయితే  ధనుష్, ఐశ్వర్యలను కలిపేందుకు రజనీకాంత్ ప్రయత్నిస్తున్నారని, త్వరలోనే వారు కలుస్తారని  ధనుష్ తండ్రి కస్తూరి రాజా ఇటీవల వెల్లడించారు. అయితే ప్రస్తుతం ధనుష్, ఐశ్వర్య తమ తమ పనుల్లో మళ్లీ బిజీ అయినట్టు తెలుస్తోంది.  ఐశ్వర్యకు సంబంధించిన ఒక ఫొటో నెట్టింట వైరల్‌గా మారడమే ఇందుకు నిదర్శనం.

కాగా గతంలో డైరెక్టర్ గా పలు సినిమాలు తెరకెక్కించిన ఐశ్వర్య మళ్లీ మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇందులో భాగంగా స్టోరీ డిస్కషన్స్ , మ్యూజిక్ వీడియోలకు సంబంధించిన చర్చల్లో పాల్గొంటుందని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.  ఇక పోతే ధనుష్ ‘సార్’ సినిమా షూటింగ్‌లో తలమునకలై ఉన్నాడు. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ లాంటి ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సంయుక్తా మేనన్ ధనుష్ సరసన సందడి చేయనుంది. కాగా.. ధనుష్, ఐశర్య హైదరాబాద్‌లోనే ఉంటున్నాని, అది కూడా ఒకే హోటల్‌లో  ఉంటున్నట్లు కొన్ని పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి.

Also Read: Andhra Pradesh: ఏపీలో8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు.. విజయవాడ కమిషనర్ గా ఎవరు రానున్నారంటే..

Srisailam: నేటి నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనానికి ఆన్‌లైన్‌ టికెట్లు.. ఎలా బుక్ చేసుకోవాలంటే..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. నేడు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..