
Deverakonda brother web series: దేవరకొండ బ్రదర్స్ విజయ్, ఆనంద్‌లు ఓ ప్రాజెక్ట్‌లో భాగం పంచుకోనున్నారా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి. అయితే ఈ ఇద్దరు కలిసి నటించడం లేదు. తన తమ్ముడితో ఓ వెబ్ సిరీస్‌ని నిర్మించే ప్లాన్‌లో విజయ్ ఉన్నట్లు తెలుస్తోంది. ద కింగ్ ఆఫ్ ది హిల్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించిన విజయ్ దేవరకొండ, మీకు మాత్రమే చెప్తా అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా యావరేజ్ టాక్‌ని తెచ్చుకోగా.. ఇప్పుడు అదే నిర్మాణ సంస్థలో వెబ్ సిరీస్‌ని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం సినిమాలకు ధీటుగా వెబ్ సిరీస్ హవా నడుస్తుంది. ఈ క్రమంలో తన తమ్ముడు ఆనంద్ ప్రధాన పాత్రలో విజయ్., ఓ వెబ్ సిరీస్‌ని ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభం అయ్యాయని తెలుస్తోంది.
కాగా మరోవైపు విజయ్ దేవరకొండ, ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ఈ మూవీలో విజయ్ సరసన అనన్య పాండే నటిస్తోంది. అలాగే దొరసానితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ, కొత్త దర్శకుడు వినోద్ దర్శకత్వంలో నటించనున్నారు. భవ్య క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Read More: