
కరోనా లాక్‌డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన డేవిడ్ వార్నర్.. టిక్‌టాక్‌లో అదరగొట్టేస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ పాటలు, డైలాగ్‌లకు తన భార్యతో కలిసి డ్యాన్స్‌లు వేస్తూ, యాక్షన్ చేస్తూ ఇక్కడి ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న అల్లు అర్జున్ అల వైకుంఠపురములోని బుట్ట బొమ్మ పాటకు డ్యాన్స్ వేసిన వార్నర్ దంపతులు.. నిన్న కమల్ హాసన్ క్షత్రియ పుత్రుడులోని సన్నజాజి పడక మ్యూజిక్ బిట్‌కు తన యాక్షన్‌తో అలరించారు. ఇక తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు డైలాగ్‌తో మరోసారి సూపర్ అనిపించారు ఈ ఆస్ట్రేలియన్ ఓపెనర్.
మహేష్ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన”పోకిరి’లోని ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అనే డైలాగ్‌కు సన్‌రైజర్స్ యూనిఫాం వేసుకొని, బ్యాట్ పట్టుకొని అదరగొట్టేశారు వార్నర్. ఇక ఈ వీడియోకు డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ సోషల్ మీడియాలో స్పందించారు. ”డేవిడ్ ఆ మొండి, అగ్రెసివ్ డైలాగ్‌లు నీకు బాగా సెట్ అయ్యాయి. నువ్వు మంచి నటుడివి కూడా. నా సినిమాలో కెమెరా అప్పియరెన్స్ ఇస్తావని భావిస్తున్నా. లవ్ యు” అని కామెంట్ పెట్టారు.
Read This Story Also: భయపెట్టేందుకు సిద్ధమవుతోన్న నాగ చైతన్య..!
David This is soooo you. Stubborn and aggressive. This dialogue suits you the best. You are fantastic as an actor also, Hope you do a cameo in my film. Love you ??? https://t.co/ejVnYNRTrS
— PURIJAGAN (@purijagan) May 10, 2020