Samantha-Rashmika: రష్మిక, సమంతల మధ్య పోటీ తప్పదా.? ఇక్కడ లేని ఆ పోరు అక్కడే ఎందుకు..

|

Jul 28, 2022 | 7:33 AM

Samantha-Rashmika: అన్ని రంగాల్లో ఉన్నట్లే సినిమా రంగంలోనూ పోటీ ఉంటుంది. మొదటి స్థానంలో నిలవాలనే కసి అందరిలోనూ ఉంటుంది. అయితే నేరుగా ఒకరితో మరొకరు పోటీ పడకపోయినప్పటికీ కెరీర్‌లో నిలదొక్కుకునే...

Samantha-Rashmika: రష్మిక, సమంతల మధ్య పోటీ తప్పదా.? ఇక్కడ లేని ఆ పోరు అక్కడే ఎందుకు..
Follow us on

Samantha-Rashmika: అన్ని రంగాల్లో ఉన్నట్లే సినిమా రంగంలోనూ పోటీ ఉంటుంది. మొదటి స్థానంలో నిలవాలనే కసి అందరిలోనూ ఉంటుంది. అయితే నేరుగా ఒకరితో మరొకరు పోటీ పడకపోయినప్పటికీ కెరీర్‌లో నిలదొక్కుకునే క్రమంలో పోటీ అనివార్యంగా మారుతుంది. ఈ పోటీ ముఖ్యంగా హీరోయిన్లలో ఎక్కువగా ఉంటుంది. హీరోయిన్లు ఎక్కువ సినిమాల్లో నటించడం, ఇద్దరు హీరోయిన్లు నటించిన సినిమాలు ఒకే సమయంలో విడుదల కావడంతో పోలిక కచ్చితంగా ఉంటుంది. అయితే తాజాగా ఇద్దరు హీరోయిన్ల మధ్య ఆసక్తికర పోటీ తప్పేలా కనిపించడం లేదు. ఆ హీరోయిన్లే సమంత, రష్మికలు. తెలుగులో టాప్‌ ప్లేస్‌లో దూసుకుపోయి ఈ ఇద్దరు బామలు ఇప్పుడు నార్త్‌ బాట పట్టారు. బాలీవుడ్‌లో వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తున్నారు.

అయితే తెలుగులో ఈ ఇద్దరు బామలు మధ్య ఎప్పుడు పోటీ రాలేదు. దీనికి కారణం రష్మిక తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న సమయంలో సమంత వివాహం కారణంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. దీంతో బాక్సాఫీస్‌ ముందు ఈ ఇద్దరు ఎప్పుడు పోటీ పడలేదు. అయితే విడాకుల అనంతరం సమంత మళ్లీ సినిమాలతో బిజీగా మారింది. ఈ సమయంలోనే సామ్‌ నార్త్‌పై గురి పెట్టింది. అయితే ఇప్పటి వరకు సమంత బాలీవుడ్‌లో నటించిన ఒక్క సినిమాపై కూడా ఫుల్‌ క్లారిటీ లేదు.

మరోవైపు రష్మిక మాత్రం పుష్పతో వచ్చిన క్రేజ్‌తో ఒకేసారి.. మిషన్ మజ్ను,గుడ్ బై, యానిమల్ వంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది. సమంత కూడా ఒకేసారి మూడు బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరి మధ్య తెలుగులో లేని పోటీ హిందీలో తప్పేలా లేదనే చర్చ జోరుగా సాగుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..