Raju Srivastava: ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూత.. చికిత్స పొందుతూ..

|

Sep 21, 2022 | 11:21 AM

Comedian Raju Srivastava passes away: ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ (58) కన్నుమూశారు.

Raju Srivastava: ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూత.. చికిత్స పొందుతూ..
Raju Srivastava
Follow us on

Comedian Raju Srivastava passes away: ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ (58) ఇక లేరు. గత 40 రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీవాస్తవ.. బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 10వ తేదీన జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా.. ఛాతిలో నొప్పి వచ్చి అక్కడికక్కడే కుప్పకూలారు. దాంతో ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు కుటుంబ సభ్యులు. గత 40 రోజులు ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీవాస్తవ.. ఇవాళ కన్నుమూశారు. శ్రీవాస్తవ మృతి వార్తను ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

శ్రీవాస్తవకు చికిత్స అందించిన వైద్యుల బృందం ఆయనను బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఆయన అభిమానులు సైతం శ్రీవాస్తవ తిరిగి రావాలాని ఆకాంక్షించారు. రాత్రిపగలు పూజలు చేసి దేవుడిని ప్రార్థించారు. అయినప్పటికీ వైద్యుల కృషి గానీ, అభిమానుల పూజలు గానీ ఆయన ప్రాణాలను నిలుపలేకపోయాయి. చికిత్స సమయంలో శ్రీవాస్తవ మెదడుకు ఆక్సీజన్ అందలేదు. మెదడు పైభాగానికి ఆక్సీజన్ అందలేదని, ఫలితంగా శ్రీవాస్తవ స్పృహలోకి రాలేదని వెల్లడించారు వైద్యులు. చివరకు ఆయన శాశ్వతంగా లోకాన్ని వీడివెళ్లారు.

ఇవి కూడా చదవండి

1980 నుంచి రాజు శ్రీవాస్తవ వినోద పరిశ్రమలో పనిచేస్తున్నారు. 2005లో రాజు శ్రీవాస్తవ స్టాండ్-అప్ కామెడీ షో ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ మొదటి సీజన్‌లో పాల్గొన్న తర్వాత గుర్తింపు పొందారు.

అతను ‘మైనే ప్యార్ కియా’, ‘ఆమ్దానీ ఆఠాణి.. ఖర్చ రూపాయా’, ‘మై ప్రేమ్ కి దీవానీ హూన్’ వంటి అనేక చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను అలరించారు.

కాగా, రాజు శ్రీవాస్తవ మృతి పట్ల పలువురు బాలీవుడ్ నటులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..