చిరంజీవి నాడు చెప్పిందే.. ఇప్పుడు ‘ఏజెంట్’ మూవీ విషయంలో నిజమయ్యిందా..?

చిరంజీవి..ఇండస్ట్రీలో అందర్నీ కలుపుకుపోయే నైజం ఆయన సొంతం. ఇండస్ట్రీలోకి వచ్చే నటులు, దర్శకులు, నిర్మాతలకు ఉపయోగపడే మంచిమాటలు ఆయన ప్రతి సందర్భంలోనూ చెబుతూనే ఉంటారు.

చిరంజీవి నాడు చెప్పిందే.. ఇప్పుడు ‘ఏజెంట్’ మూవీ విషయంలో నిజమయ్యిందా..?
Megastar Chiranjeevi (File Photo)

Updated on: May 04, 2023 | 1:01 PM

చిరంజీవి..ఇండస్ట్రీలో అందర్నీ కలుపుకుపోయే నైజం ఆయన సొంతం. ఇండస్ట్రీలోకి వచ్చే నటులు, దర్శకులు, నిర్మాతలకు ఉపయోగపడే మంచిమాటలను పెద్దరికంతో ఆయన ప్రతి సందర్భంలోనూ చెబుతూనే ఉంటారు. మొన్న ఆ మధ్య తన వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్‌లోనూ ఆయన ఓ పచ్చి నిజం చెప్పారు. అయితే  కానీ అలా మంచి చెప్పనందుకే అప్పట్లో అందరూ ఆయన్ను ట్రోల్ చేశారు. విమర్శలూ చేశారు. కానీ అఖిల్ ఏజెంట్ బాక్సాఫీస్ ముందు తేలిపోవడంతో.. అప్పుడు చిరంజీవి చెప్పిన మాటలే ఇప్పుడు నిజమయ్యాయని ఇండస్ట్రీలో చాలా మంది అందరూ అంటున్నారు.

ఇంతకీ చిరంజీవి నాడు ఏం చెప్పారు?

ఎప్పుడూ ఇండస్ట్రీ బాగోగులతో పాటు ప్రొడ్యూసర్ల మంచి కోరుకుంటారు చిరంజీవి. అప్పట్లో వాల్తేరు వీరయ్య సక్సెస్ వేదికపై యంగ్ డైరెక్టర్లకు కొన్ని సూచనలు చేశారు. షూటింగ్‌ స్టార్ట్ అవడం కంటే ముందే డైరెక్టర్లు బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలన్నారు. షూటింగ్ మధ్యలో సందర్భానుసారం.. సీన్‌లో చేంజెస్‌ చేస్తే పర్లేదు కానీ.. అప్పటికప్పుడే సీన్ డెవలప్ చేసే పద్దతి.. ఆ తరువాత స్టోరీ రాసుకునే పద్దతి మానుకోవాలన్నారు. స్క్రిప్ట్‌ కు మించి ఒక్క సీన్‌ కూడా తెరకెక్కించకుండా ఉండేలా ముందే పేపర్ వర్క్ చేయాలన్నారు. అలా ప్రొడ్యూసర్‌కు డబ్బు ఆదా చేయాలని.. ప్రొడ్యూసర్లను బతికించాలని చెప్పారు. వారు బాగుంటేనే మరిన్ని సినిమాలు వస్తాయాని ఇండస్ట్రీ కళకళలాడుతూ పచ్చగా ఉంటుందని వర్తమాన డైరకెర్లకు అప్పట్లో కాస్త గట్టిగా చెప్పారు మెగాస్టార్.

ఇవి కూడా చదవండి

అయితే ఇలా చెప్పినందుకే చిరు విమర్శల పాలయ్యారు. కానీ తాజాగా అఖిల్ ఏజెంట్ సినిమా రిజెల్ట్ పై ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ట్వీట్ చేయడం.. ఆ ట్వీట్లో బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ మొదలుపెట్టామని చెప్పడంతో పాటు, మరోసారి ఈ తప్పు చేయబోనని అన్నారు. దీంతో నాటి చిరంజీవి మాటలు నిజం అయ్యాయనే టాక్ ఇప్పుడు నెట్టింట వినిపిస్తోంది.  అటు ఇండస్ట్రీలోనూ నాడు చిరంజీవి చెప్పింది కరెక్టే అన్న టాక్ వినిపిస్తోంది. ఇకనైనా యువ దర్శకులు, నిర్మాతలు చిరంజీవి ఇచ్చిన సలహాలు తీసుకుని.. ఆ రకంగా పక్కా ప్లాన్స్‌తో తమ ప్రాజెక్టులు మొదలు పెట్టాల్సిన అవసరముంది.

(సతీష్ చంద్ర, టీవీ9 ET)