చిరు సినిమాలో కీలక పాత్రలో బన్నీ..!

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత లూసిఫర్ రీమేక్‌లో ఆయన నటించబోతున్నారు

చిరు సినిమాలో కీలక పాత్రలో బన్నీ..!

Edited By:

Updated on: Apr 18, 2020 | 5:03 PM

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత లూసిఫర్ రీమేక్‌లో ఆయన నటించబోతున్నారు. సాహో ఫేమ్‌ సుజీత్ ఈ మూవీని డైరక్ట్ చేయబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోన్న ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే ఇందులో ఓ కీలక పాత్ర కోసం అల్లు అర్జున్‌ని అనుకుంటున్నారట. మాతృకలో పృథ్వీరాజ్‌ పోషించిన పాత్రను బన్నీతో చేయించాలని టీమ్‌ అనుకుంటుందట. అందులో పృథ్వీరాజ్‌ పాత్ర ఎక్కువ లేకపోయినప్పటికీ.. ఇక్కడ బన్నీ కోసం పలు మార్పులను చేయబోతున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే.. చిరు, బన్నీ కలిసి నటించే రెండో చిత్రం ఇది అవుతోంది. కాగా హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు చిరంజీవి నటించిన డాడీ చిత్రంలో బన్నీ ఓ పాత్రలో మెరిశారు. అలాగే శంకర్‌దాదా జిందాబాద్‌లోనూ ఓ పాటలో అలా వచ్చి ఇలా వెళ్లిన విషయం తెలిసిందే.

Read This Story Also: ఆ టెస్ట్ తరువాతే భర్తను ఇంట్లోకి అనుమతించిన భార్య..!