అక్కడ మా మాతృమూర్తి కాదు.. కానీ..!

| Edited By:

Apr 12, 2020 | 7:27 AM

కరోనాపై పోరులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవీ సమాజసేవ చేస్తోందని.. తన ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి 700 మాస్క్‌లను కుట్టి.. వాటిని అవసరమైన వారికి ఇస్తోందని ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి.

అక్కడ మా మాతృమూర్తి కాదు.. కానీ..!
Follow us on

కరోనాపై పోరులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవీ సమాజసేవ చేస్తోందని.. తన ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి 700 మాస్క్‌లను కుట్టి.. వాటిని అవసరమైన వారికి ఇస్తోందని ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి. అవి కాస్త చిరంజీవి వద్దకు వెళ్లగా.. ఆయన సోషల్ మీడియాలో స్పందించారు.

”కొన్ని దినపత్రికలు, సోషల్ మీడియా ఛానెల్స్‌లో మా తల్లి సమాజసేవ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అక్కడ మా మాతృమూర్తి కాదు. కానీ సేవ చేస్తోన్న ఆ తల్లికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే” అని ఆయన ట్వీట్ చేశారు. కాగా కరోనా నేపథ్యంలో పలువురు ప్రముఖులతో పాటు సామాన్యులు మాస్క్‌లు రెడీ చేసి అవసరమైన వారికి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సతీమణి కూడా మాస్క్‌లను కుట్టి అవసరమైన వారికి అందించిన విషయం తెలిసిందే.

Read This Story Also: జగన్ ప్రభుత్వంపై న్యాయపోరాటానికి సిద్ధం.. హైకోర్టుకు నిమ్మగడ్డ..!