AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ‌హిళా అభిమానికి అంజ‌నీ పుత్రుడి సాయం..జై చిరంజీవ‌..!

పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి సహాయంతో శ‌నివారం..ఆయ‌న మ‌హిళ‌ అభిమాని రాజనాల నాగలక్ష్మి హార్ట్ ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. స్టార్ హాస్పిట‌ల్ చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎమ్. గోపీచంద్ గారి ఆధ్వర్యంలో సుమారు 3.30 నిమిషాలు ఆపరేషన్ చేశారు. ‘ఈ రోజు మీ అందరి ప్రార్థనలు ఫలించాయి. ఆమెకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స‌క్సెస్ ఫుల్ గా ఆప‌రేష‌న్ జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము’ అని అఖిల భారత చిరంజీవి యువత అధ్య‌క్షుడు స్వామినాయుడు తెలిపారు. మెగాస్టార్ […]

మ‌హిళా అభిమానికి అంజ‌నీ పుత్రుడి సాయం..జై చిరంజీవ‌..!
Ram Naramaneni
|

Updated on: Apr 11, 2020 | 10:46 PM

Share

పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి సహాయంతో శ‌నివారం..ఆయ‌న మ‌హిళ‌ అభిమాని రాజనాల నాగలక్ష్మి హార్ట్ ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. స్టార్ హాస్పిట‌ల్ చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎమ్. గోపీచంద్ గారి ఆధ్వర్యంలో సుమారు 3.30 నిమిషాలు ఆపరేషన్ చేశారు. ‘ఈ రోజు మీ అందరి ప్రార్థనలు ఫలించాయి. ఆమెకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స‌క్సెస్ ఫుల్ గా ఆప‌రేష‌న్ జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము’ అని అఖిల భారత చిరంజీవి యువత అధ్య‌క్షుడు స్వామినాయుడు తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు

ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, ` డాక్ట‌ర్ గోపీచంద్ గారికి..వాళ్ల బృందానికి ధ‌న్య‌వాదాలు. అలాగే ఈ విష‌యాన్ని స‌మ‌యానికి నా దృష్టికి తీసుకొచ్చిన స్వామి నాయుడికి, హైద‌రాబాద్ వ‌ర‌కూ రావ‌టానికి ఏర్పాట్లు చేసిన బి. దిలీప్ గారికి, ఇంతదూరం ప్ర‌యాణించ‌డానికి అనుమ‌తిచ్చిన రెండు రాష్ట్రాల పోలీసు అధికారుల‌కి..ఇత‌ర సిబ్బందికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాని` అన్నారు.

Follow Us