‘సీసీసీ’ కోసం దానికైనా సిద్ధమేనన్న మెగాస్టార్..!

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో సినిమా కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో చొరవ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. వారి కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ)ని స్థాపించిన విషయం తెలిసిందే. దీనికి వచ్చిన విరాళాలతో.. ఇప్పటికే చాలా మంది సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు అందించారు. లాక్‌డౌన్ కొనసాగేవరకు ఈ ఛారిటీ సినీ కార్మికులకు సాయం అందించనుంది. కాగా ఈ ఛారిటీ గురించి మెగాస్టార్ తాజాగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ”సీసీసీని స్థాపించాలని అనుకున్న సమయంలో […]

సీసీసీ కోసం దానికైనా సిద్ధమేనన్న మెగాస్టార్..!

Edited By:

Updated on: Apr 20, 2020 | 1:05 PM

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో సినిమా కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో చొరవ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. వారి కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ)ని స్థాపించిన విషయం తెలిసిందే. దీనికి వచ్చిన విరాళాలతో.. ఇప్పటికే చాలా మంది సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు అందించారు. లాక్‌డౌన్ కొనసాగేవరకు ఈ ఛారిటీ సినీ కార్మికులకు సాయం అందించనుంది. కాగా ఈ ఛారిటీ గురించి మెగాస్టార్ తాజాగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

”సీసీసీని స్థాపించాలని అనుకున్న సమయంలో నేను డబ్బుల గురించి ఆలోచించలేదు. దీన్ని ఎంతవరకు అమలు చేయగలం అని మాత్రమే ఆలోచించా. కానీ నాకు ఎన్‌. శంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, మెహర్ రమేష్ తదితరులు అన్ని పరిష్కారాలను వివరించారు. దీంతో నా ప్రయత్నంలో మొదటి అడుగు పడింది. ఈ కరోనా ఎఫెక్ట్ ఒక నెల మాత్రమే ఉంటుందని మేము భావించలేదు. ఈ కాలంలో సినీ పరిశ్రమలో ఉన్న 24 క్రాఫ్ట్ వాళ్లను ఆదుకోవాలనే మూడు నెలల పాటు ఆదుకోవాలనే ఉద్దేశ్యంలోనే ఈ ఛారిటీని స్థాపించాం. అంతేకాదు ఓ ఆడిటర్ ను నియమించి లెక్కలను చూస్తున్నాం” అని పేర్కొన్నారు.

ఇక ఈ ఛారిటీ కోసం నిధులు కావాలంటే తాను ఎవరినైనా చేయి చాచి విరాళాలు అడగటానికి కూడా సిద్దమేనని మెగాస్టార్ అన్నారు. ”కొన్ని కంపెనీలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. కావాలంటే సహాయం చేయమని వారిని అడుగుతాను” అని చిరు పేర్కొన్నారు. ఇక చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పుడు తాను ఎవరినీ ఒక్క రూపాయి కూడా అడగలేదని.. ఇటీవల కూడా రూ.38లక్షలతో ఓ పరికారాన్ని కొనుగోలు చేశానని వెల్లడించారు. కానీ టాలీవుడ్‌లో ఉన్న 24 క్రాఫ్ట్ రంగాల వారిని ఆదుకునేందుకు తాను ఈ ఛారిటీకి విరాళాలు ఇవ్వాల్సిందిగా అందరినీ కోరానని చిరంజీవి అన్నారు.

Read This Story Also: షాకింగ్.. రిలీజ్‌ అవ్వాల్సిన సినిమాకు రీ షూటింగ్‌..!