AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల వైకుంఠపురంలో: ‘బుట్ట బొమ్మ’.. అదిరిపోయిందమ్మా

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘అల వైకుంఠపురంలో’. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్. ఈ క్రమంలో ఇప్పటికే మూడు పాటలను విడుదల చేయగా.. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సామజవరగమన, రాములో రాములా పాటలకు ఆన్‌లైన్‌లో 100మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి నాలుగో […]

అల వైకుంఠపురంలో: 'బుట్ట బొమ్మ'.. అదిరిపోయిందమ్మా
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 22, 2019 | 3:58 PM

Share

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘అల వైకుంఠపురంలో’. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్. ఈ క్రమంలో ఇప్పటికే మూడు పాటలను విడుదల చేయగా.. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సామజవరగమన, రాములో రాములా పాటలకు ఆన్‌లైన్‌లో 100మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఇక తాజాగా ఈ మూవీ నుంచి నాలుగో పాటకు సంబంధించిన టీజర్ విడుదలైంది. ‘బుట్ట బొమ్మా’ అంటూ సాగే రొమాంటిక్ మెలోడీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే ఈ పాట ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడింది. ఇక తాజాగా టీజర్‌ను విడుదల చేసిన టీమ్.. ఫుల్ సాంగ్‌ను 24న రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపింది. కాగా ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా అర్మాన్ మాలిక్ పాటను పాడారు. ఇక ఈ పాటకు థమన్ అందించిన సంగీతం అదిరిపోయింది. దీంతో ఈ పాట కోసం ఎదురుచూస్తున్నామంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అల వైకుంఠపురంలో సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటించగా.. టబు, నివేథా పేతురాజ్, జయరామ్, సుశాంత్, నవదీప్ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే టీజర్, పాటలతో ఆకట్టుకున్న ఈ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

Follow Us
ఎటువంటి రుసుములు లేని ఉత్తమ లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డులు
ఎటువంటి రుసుములు లేని ఉత్తమ లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డులు
కోడికి కూడా హార్ట్ బ్రేక్ అవుతుందా.. తోడు కోల్పోయినప్పుడు అవి..
కోడికి కూడా హార్ట్ బ్రేక్ అవుతుందా.. తోడు కోల్పోయినప్పుడు అవి..
ఆ సినిమా ఫ్లాప్‌తో నా ఆలోచన పూర్తిగా మారిపోయింది..
ఆ సినిమా ఫ్లాప్‌తో నా ఆలోచన పూర్తిగా మారిపోయింది..
అగ్గిపుల్లపై అద్భుత సృష్టి.. ఏలూరు కళాకారుడి రికార్డుల ప్రస్థానం
అగ్గిపుల్లపై అద్భుత సృష్టి.. ఏలూరు కళాకారుడి రికార్డుల ప్రస్థానం
మైదానంలోనే నరకం చూసిన రాహుల్.. నడవలేని స్థితిలో స్థార్ బ్యాటర్
మైదానంలోనే నరకం చూసిన రాహుల్.. నడవలేని స్థితిలో స్థార్ బ్యాటర్
అగ్గిపుల్లే కాదా అని అనుకోవద్దు.. ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు!
అగ్గిపుల్లే కాదా అని అనుకోవద్దు.. ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు!
1049 ఎకరాల భూ రికార్డులు తారుమారు? బొంరాస్‌పేట రైతుల ఆందోళన
1049 ఎకరాల భూ రికార్డులు తారుమారు? బొంరాస్‌పేట రైతుల ఆందోళన
విశాఖ- భోగాపురానికి ఎయిరో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ప్రారంభం
విశాఖ- భోగాపురానికి ఎయిరో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ప్రారంభం
వస్తువుల ధరలు రూ.499, రూ.799, రూ.999 అని ఎందుకు ఉంటాయి?ఆ సీక్రెట్
వస్తువుల ధరలు రూ.499, రూ.799, రూ.999 అని ఎందుకు ఉంటాయి?ఆ సీక్రెట్
94 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో గంగులీ తర్వాత మనోడే
94 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో గంగులీ తర్వాత మనోడే