Mahesh Babu : మహేష్ బాబు ఫ్యాన్స్ అత్యుత్సాహం.. థియేటర్ ముందు రచ్చ..

మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు మహేష్ నటించిన బిజినెస్‌మేన్ సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది. నవంబర్ 29న ఈ సినిమాను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు మేకర్స్. ఈ క్రమంలోనే ఘట్టమనేని ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపించారు.

Mahesh Babu : మహేష్ బాబు ఫ్యాన్స్ అత్యుత్సాహం.. థియేటర్ ముందు రచ్చ..
Mahesh Babu

Updated on: Dec 01, 2025 | 11:14 AM

గత కొన్నాళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్, తమిళ భాషలలో అనేక చిత్రాలు మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిజినెస్ మెన్ సినిమాను సైతం రీరిలీజ్ చేశారు మేకర్స్. న‌వంబర్ 29న ఈ చిత్రాన్ని మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. దీంతో ఘట్టమనేని అభిమానులు సంబరాలు చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మహేష్ ఫ్యాన్స్ చేసిన హడావిడి గురించి చెప్పక్కర్లేదు. అయితే అభిమానులు హద్దులు దాటింది. కొన్నిచోట్ల ప్రమాదాలకు దారితీసింది. తాజాగా అంబేద్కర్ కోన‌సీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలోని శ్రీ వెంకటేశ్వర థియేటర్ ఎదుట ఊహించ‌ని సంఘటన చోటుచేసుకుంది.

ఇవి కూడా చదవండి : Maheshwari : పెళ్లి సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఆమె కూతురు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్..

బిజినెస్ మెన్ సినిమా రీరిలీజ్ సందర్భంగా రాజోలు మండలం తాటిపాకలోని వెంకటేశ్వర థియేటర్ ముందు భారీ సంఖ్యలో అభిమానులు హంగామా చేశారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చడంతోపాటు, కొంతమంది యువకులు తమ బైకులను ఎక్సలేటర్ పెంచుతూ రౌండ్లు వేయడం ప్రారంభించారు. సినిమా థియేటర్ ఎదుట గ్లామర్ బైక్ ఎక్సలేటర్ రైస్ చేస్తూ రోడ్టుపై రౌండ్లు వేయడంతో బైక్ నుండి మంటలు వ్యాపించి బైక్ పూర్తిగా దగ్గమైంది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని అభిమానులను హెచ్చరించారు. అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల ప్రమాదాలు తప్పవని, ప్రజా ప్రదేశాల్లో స్టంట్లు చేయరాదని సూచించారు.

ఇవి కూడా చదవండి : Actor : ఒకప్పుడు మామిడి కాయలు అమ్మాడు.. ఇండస్ట్రీలోనే టాప్ నటుడు.. ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యునరేషన్..

మరోవైపు ఓ అభిమాని సీసాతో తన తల పగలగొట్టుకుని మరీ రక్తంతో మహేష్ పోస్టర్ కు తిలకం దిద్దారు. మహేష్ బాబు నటించిన బిజినెస్ మెన్ సినిమా ఇప్పటికే పలుమార్లు రిలీజ్ అయ్యింది. అప్పట్లోనే ఈ మూవీ మంచి వసూల్లు రాబట్టింది.

ఇవి కూడా చదవండి : Actress : అతడిని నమ్మి ఆ సీన్స్ చేశాను.. కానీ షూట్‌లో.. హీరోయిన్ కామెంట్స్..

 

ఇవి కూడా చదవండి : Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. బ్రహ్మానందంపై అలాంటి మాటలా.. ?