సెన్సార్ చిక్కుల్లో ‘బుర్రకథ’!

|

Jun 28, 2019 | 11:27 AM

ఆది సాయికుమార్ హీరోగా రచయిత డైమండ్ రత్నబాబు డైరెక్టర్‌గా మారి తెరకెక్కించిన చిత్రం ‘బుర్రకథ’. రెండు మెదళ్లతో పుట్టిన హీరో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. కాగా మొదట ఈ సినిమా జూన్ 28న అనగా ఇవాళ విడుదల కావాల్సి ఉంది. అయితే సెన్సార్ కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీ జూన్ 28 నుంచి జూన్ 29కు షిఫ్ట్ అయిందని నిన్న చిత్ర బృందం వెల్లడించింది. కానీ తాజా సమాచారం ప్రకారం […]

సెన్సార్ చిక్కుల్లో బుర్రకథ!
Follow us on

ఆది సాయికుమార్ హీరోగా రచయిత డైమండ్ రత్నబాబు డైరెక్టర్‌గా మారి తెరకెక్కించిన చిత్రం ‘బుర్రకథ’. రెండు మెదళ్లతో పుట్టిన హీరో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. కాగా మొదట ఈ సినిమా జూన్ 28న అనగా ఇవాళ విడుదల కావాల్సి ఉంది. అయితే సెన్సార్ కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీ జూన్ 28 నుంచి జూన్ 29కు షిఫ్ట్ అయిందని నిన్న చిత్ర బృందం వెల్లడించింది.

కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రేపు కూడా రిలీజ్ కావట్లేదని తెలుస్తోంది. త్వరలోనే మరో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్రబృందం చెబుతున్నారు. ఈ సినిమా వ‌ర‌ల్డ్‌వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్‌‌ను వింటేజ్ క్రియేష‌న్స్ ద‌క్కించుకుని సినిమాను విడుదల చేస్తోంది.

మిస్తీ చక్రబోర్తి , నైరాషాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా.. దీపాల ఆర్ట్స్ బ్యాన‌ర్‌‌పై హెచ్‌ కె.శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నారు.