Vikram Vedha: హృతిక్‌ రోషన్‌పై నెటిజన్ల ఆగ్రహం! ‘అవునా.. ముందు నీ సినిమా సంగతి చూస్కో!’

|

Aug 18, 2022 | 2:37 PM

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌ కొత్త మువీ ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ‘బాయ్‌కాట్ లాల్‌ సింగ్‌ చడ్డా’ హ్యష్‌ ట్యాగ్‌తో నెటిజన్లు..

Vikram Vedha: హృతిక్‌ రోషన్‌పై నెటిజన్ల ఆగ్రహం! అవునా.. ముందు నీ సినిమా సంగతి చూస్కో!
Boycott Vikram Vedha
Follow us on

Boycott Vikram Vedha: బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌ కొత్త మువీ ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ‘బాయ్‌కాట్ లాల్‌ సింగ్‌ చడ్డా’ హ్యష్‌ ట్యాగ్‌తో నెటిజన్లు ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకించడంతో బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా నేల చూపులు చూస్తోంది. ఐతే తాజాగా ఈ సినిమాను ముంబయిలోని ఓ మల్టిప్లెక్స్‌లో చూసిన హీరో హృతిక్‌ రోషన్‌ సినిమా బాగుందని, ప్లస్‌లు మైనస్లను మినహాయిస్తే.. సినిమా చాలా బాగుంది. సినిమాని మిస్‌ అవ్వొద్దు. వెంటనే వెళ్లి చూడండంటూ ట్విటర్‌లో పోస్టు పెట్టాడు. దీంతో నెటిజన్లు హృతిక్‌ను దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. ‘అవునా..! కశ్మీర్ ఫైల్‌ మువీ రిలీజ్‌ టైంలో ఎక్కడున్నావ్‌’, ‘కశ్మీల్‌ ఫైల్స్‌ మువీ చూశావా? నువ్వు, నీ మాజీ భార్య దర్టీ మారిటల్ అఫైర్స్‌ గురించి మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు’, ‘స్టాప్‌ దిస్‌ నాన్‌ సెన్స్ ఫస్ట్‌! మన పిల్లలు తప్పుగా ప్రభావితం అవుతారు’, ‘అవునా..ఐతే ఈసారి నీ కొత్త మువీ విక్రమ్‌ వేద వంతు’, ‘హృతిక్‌ ముందు నీ సినిమా సంగతి చూసుకో’, ‘బాయ్‌కాట్‌ విక్రమ్‌ వేద’, ‘ఇప్పుడీ విషయం నీకవసరమా!’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా సైఫ్‌ అలీ ఖాన్, హృతిక్‌ రోషన్‌ హీరోలుగా తమిళ చిత్రం ‘విక్రమ్‌ వేద’ను హిందీలో రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే. ‘విక్రమ్‌ వేద’ సెప్టెంబరు 30న విడుదలకు సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం. ఈ క్రమంలో తాజా వివాదంలో హృతిక్‌ ఎందుకు తలదూర్చాడంటూ ‘విక్రమ్‌ వేద’ నిర్మాతలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

హృతిక్‌ రోషన్‌ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాకు మద్దతుగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీరిలో కొందరు నెటిజన్లు హృతిక్‌ను విమర్శించగా, మరికొందరు కాశ్మీర్ ఫైల్స్ మువీ హ్యష్ ట్యాగ్ ను జోడించి తిట్టిపోస్తున్నారు.  1990లో కాశ్మీర్ తిరుగుబాటు సమయంలో ఊచకోతకు గురైన కశ్మీర్ పండిట్ల కథనంపై ది కాశ్మీర్ ఫైల్స్ రూపొందించిన విషయం తెలిసిందే. ఈ మువీ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ క్రమంలో కాశ్మీర్ ఫైల్స్ మువీని ట్యాగ్‌ చేస్తూ నెటిజన్లు హృతిక్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.