
కార్తీక్ ఆర్యన్ తన రాబోయే చిత్రం ‘చందు ఛాంపియన్’ కోసం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే, అతను కొన్ని ఫోటోలు అలాగే వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. కార్తీక్‌కు సంబంధించిన ఈ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. వీటిలో కార్తీక్ ఆర్యన్ తన స్నేహితులతో కలిసి టీ సిప్ చేస్తూ బెంగళూరులో సరదాగా గడుపుతున్నాడు. ఈ వీడియోలో, కార్తీక్ ఆర్యన్ కన్నడ భాషలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాడు. కార్తీక్ స్నేహితుల్లో ఒకరు అతనికి కన్నడ మాట్లాడటానికి సహాయం చేసారు. ఈ క్లిప్‌లలో కార్తీక్ ఫుడ్ బ్లాగర్ స్టైల్‌లో కనిపిస్తాడు. నిజానికి, కార్తీక్ తన టీమ్‌తో చీట్ మీట్ డేకి వెళ్ళాడు. ఇక్కడ అతను తన స్నేహితులతో చాలా సరదాగా గడిపాడు అలాగే వివిధ రెస్టారెంట్ల నుండి ఆహారాన్ని కూడా ఆస్వాదించాడు.
ఒక వీడియో క్లిప్‌లో, కార్తీక్ ఆర్యన్ కన్నడలో ఫిల్టర్ కాఫీని ఆర్డర్ చేస్తూ కనిపించాడు. ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో పాటు, అతను ఫన్నీ క్యాప్షన్ కూడా రాశాడు. బెంగళూరులో తన అనుభవం అద్భుతమైనదని, అందుకే తాను ఇప్పుడు ఫుడ్ బ్లాగర్ కావాలని ఆలోచిస్తున్నాడని కార్తీక్ రాశాడు.కార్తీక్ ఆర్యన్ ఈ వీడియో బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ దాగ్గర తీశాడీ. ఇందులో కార్తీక్ “కొంచెం ఇవ్వండి, ఎక్కువ ఇవ్వకండి” అని కన్నడలో చెప్పాడు. దీని తర్వాత వారికి తినడానికి సాంబార్ ఇస్తే .., ఇది చూసిన వారు ఇది పప్పు అని అడిగారు. కాదు అది సాంబార్ అని చెబుతారు. అరటి ఆకుపై వివిధ రకాల దక్షిణ భారత వంటకాలను వారి ముందు ఉంచారు.
కార్తీక్ ఆర్యన్ చివరిగా నటించిన చిత్రం ‘సత్యప్రేమ్ కి కథ’. ఈ చిత్రంలో కార్తీక్ మరియు కియారా అద్వానీ ఆకట్టుకున్నారు. ఈ రొమాంటిక్ చిత్రానికి సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.118.5 కోట్లు రాబట్టింది. ఇప్పుడు కార్తీక్ తన తదుపరి చిత్రం చందు ఛాంపియన్ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇది 14 జూన్ 2024న విడుదల అవుతుంది. దీనికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.