Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వ్యాక్సిన్ వార్ డైరెక్టర్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

|

Oct 03, 2023 | 10:03 AM

ఈ సినిమాతో ఈ ఏడాది షారుఖ్ ఖాన్ రెండో విజయం సాధించారు. ఇప్పటికే పఠాన్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడమే కాకుండా వెయ్యికోట్ల మార్క్ ను టచ్ చేశారు. ఓకే ఏడాది రెండు సినిమాలతో వెయ్యికోట్ల వసూళ్లు రాబట్టిన హీరోగా షారుఖ్ ఖాన్ రికార్డ్ క్రియేట్ చేశారు. బాలీవుడ్ లో ఇంతవరకు ఏ హీరోకు ఇది సాధ్యం కాలేదు. దాంతో షారుక్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వ్యాక్సిన్ వార్ డైరెక్టర్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
Shahrukh Khan
Follow us on

షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ‘జవాన్ మూవీ’ సక్సెస్‌తో దూసుకుపోతున్నాడు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో ఈ ఏడాది షారుఖ్ ఖాన్ రెండో విజయం సాధించారు. ఇప్పటికే పఠాన్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడమే కాకుండా వెయ్యికోట్ల మార్క్ ను టచ్ చేశారు. ఓకే ఏడాది రెండు సినిమాలతో వెయ్యికోట్ల వసూళ్లు రాబట్టిన హీరోగా షారుఖ్ ఖాన్ రికార్డ్ క్రియేట్ చేశారు. బాలీవుడ్ లో ఇంతవరకు ఏ హీరోకు ఇది సాధ్యం కాలేదు. దాంతో షారుఖ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు డంకీ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు ఈ బాలీవుడ్ బాద్షా..

షారుఖ్ ఖాన్‌ని ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసం లేదు. అయితే ఆయనను విమర్శించే వారు కూడా లేకపోలేదు. తాజాగా షారుఖ్ ఖాన్‌పై ‘ది కాశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి విమర్శలు గుప్పించారు. షారుఖ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అగ్నిహోత్రి.

షారుఖ్ ఖాన్ బాలీవుడ్ లో డిమాండ్ ఉన్న నటుడు. ఎన్నో రకాల పాత్రలు చేశాడు. వయసు 60 చేరువవుతున్నప్పటికీ సిక్స్ ప్యాక్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇప్పుడు వివేక్ అగ్నిహోత్రి షారుక్ గురించి  చేసిన కామెంట్స్ ఆయన అభిమానులకు కోపం తెప్పిస్తున్నాయి. అగ్నిహోత్రి మాట్లాడుతూ.. షారుఖ్ తాజా చిత్రం జవాన్ సూపర్ స్పెషల్. కానీ ఇంతకంటే బాగా నటించే శక్తి షారుఖ్ కు ఉంది’ అని వివేక్ అగ్నిహోత్రి అన్నారు. సినిమా విజయాన్ని కొలిచే ప్రమాణాలు సరైనవి కాదన్నది ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దాంతో షారుఖ్ అభిమానులు మండిపడుతున్నారు. సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తే ఇప్పుడు అగ్నిహోత్రి విమర్శించడం కరెక్ట్ కాదు అంటున్నారు షారుఖ్ ఫ్యాన్స్. అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ది వ్యాక్సిన్ వార్ ఫ్లాప్ అవ్వడంతో ఆయన ఇప్పుడు షారుఖ్ పై విమర్శలు చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు.

అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమా ఆశించిన స్థాయి ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో నానా పటేకర్, అనుపమ్ ఖేర్, సప్తమి గౌడ, పల్లవి జోషి తదితరులు నటించారు. ఈ సినిమా నాలుగు రోజుల్లో ఐదు కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది. గతంలో వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ది వ్యాక్సిన్‌ వార్‌ సినిమా మాత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..