Chhaava Movie: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ఛావా.. విక్కీ కౌశల్ సినిమా 16 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన 'ఛావా' సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా విడుదలై రెండు వారాలు గడుస్తున్నా కలెక్షన్లు మాత్రం స్టడీగానే కొనసాగుతున్నాయి. ఇప్పటికే 'ఛావా' సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు కొల్ల గొట్టింది.

Chhaava Movie: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ఛావా.. విక్కీ కౌశల్ సినిమా 16 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందంటే?
Chhaava Movie

Updated on: Mar 02, 2025 | 11:58 AM

విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘ఛావా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు రాబడుతోంది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా విడుదలై 16 రోజులు అయింది. ఈ 16 రోజుల్లో ‘ఛవా’ ఎంత వసూళ్లు రాబట్టింది? సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయి? ‘ఛవా’ సినిమా ఎలాంటి రికార్డులను బద్దలు కొట్టిందో తెలుసుకుందాం రండి. ‘ఛావా’ చిత్రం 16వ రోజు అంటే శనివారం (మార్చి 02) 25 కోట్లు వసూలు చేసింది. తద్వారా 16వ రోజు లేదా మూడవ శనివారం అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా రికార్డు సృష్టించింది. ‘పుష్ప 2’ సినిమా మూడవ శనివారం నాడు రూ.21.50 కోట్లు వసూలు చేసింది. ‘పుష్ప 2’ అనేది భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదలైన పాన్-ఇండియా చిత్రం అని గమనించాలి. కానీ ‘ఛవా’ సినిమా పాన్-ఇండియా చిత్రం కాదు. ‘పుష్ప 2’ సినిమాతో పోలిస్తే, ఇంత పెద్ద సంఖ్యలో థియేటర్లలో విడుదల కాలేదు. అయినప్పటికీ, ‘పుష్ప 2’ ఆ రికార్డును ఛావా బద్దలు కొట్టింది.

ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఛావా సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో ఆయన భార్య యేసుభాయ్ పాత్రలో రష్మిక మందన్న అద్బుతంగా నటించింది. అక్షయ్ ఖన్నా ఔరంగజేబు పాత్రలో ఒదిగిపోయాడు. అలాగే డయానా పెంటీ, అశుతోష్ రాణా, దివ్య దత్తా, వినీత్ కుమార్ సింగ్, సంతోష్ జువేంకర్, ప్రదీప్ రావత్, కిరణ్ కర్మాకర్, అలోక్ నాథ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

పుష్ప 2 రికార్డు సైతం బద్దలు..

ఛావా సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా, ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. దినేష్ విజయన్ నిర్మాతగా వ్యవహరించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.