నీకు అదే జరుగుతుంది జాగ్రత్త.. సోనాక్షి పెళ్లి పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ఈ పెళ్లి గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరికి చాలా మంది ప్రముఖులు తమ విషెస్ తెలుపుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో సోనాక్షి అభిమానులు ఆమె ఫోటోలను వైరల్ చేస్తున్నారు. తాజాగా స్వర భాస్కర్ కూడా సోనాక్షి , జహీర్ వివాహం గురించి తన అభిప్రాయాన్ని తెలిపింది. అందరూ సోనాక్షి జంటను విష్ చేస్తుంటే.. స్వర భాస్కర్ మాత్రం ఆమెను జాగ్రత్తగా ఉండాలంటూ వార్న్ చేసింది.

నీకు అదే జరుగుతుంది జాగ్రత్త.. సోనాక్షి పెళ్లి పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Sonakshi Sinha

Updated on: Jun 19, 2024 | 1:28 PM

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా పెళ్లి వార్తలతో బాలీవుడ్ మీడియాలో సందడి నెలకొంది. సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ పెళ్లి టాపిక్ బాలీవుడ్‌లో ఎక్కడ చూసినా హల్‌చల్ చేస్తోంది. ఈ పెళ్లి గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరికి చాలా మంది ప్రముఖులు తమ విషెస్ తెలుపుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో సోనాక్షి అభిమానులు ఆమె ఫోటోలను వైరల్ చేస్తున్నారు. తాజాగా స్వర భాస్కర్ కూడా సోనాక్షి , జహీర్ వివాహం గురించి తన అభిప్రాయాన్ని తెలిపింది. అందరూ సోనాక్షి జంటను విష్ చేస్తుంటే.. స్వర భాస్కర్ మాత్రం ఆమెను జాగ్రత్తగా ఉండాలంటూ వార్న్ చేసింది. ఇంతకు స్వరా ఎందుకు ఆలా చెప్పింది.? ఏ విషయంలో సోనాక్షిని స్వరా జాగ్రత్తగా ఉండమంది.?

బాలీవుడ్ బ్యూటీ స్వర భాస్కర్ తన సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వాటితో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, సామాజిక కార్యకర్త ఫహద్ అహ్మద్‌ను వివాహం చేసుకుని స్వరా అందరినీ ఆశ్చర్యపరిచింది. వారిద్దరూ 2023 ఫిబ్రవరి 16న కోర్టులో వివాహం చేసుకున్నారు. కాగా ఈ అమ్మడు ఎప్పుడూ వివాదాలతో సావాసం చేస్తుంటుంది.  ఆమె చేసే కామెంట్స్ ఇప్పటికే చాలా వివాదాలకు దారితీశాయి. దాంతో ఆమె చాలా ట్రోలింగ్‌లను కూడా ఎదుర్కోవలసి వచ్చింది. ఇటీవల సోనాక్షి సిన్హా , జహీర్ ఇక్బాల్ వివాహం గురించి  ఆమె మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

సోనాక్షి జంట జూన్ 23న ఒక గ్రాండ్ పార్టీని నిర్వహించబోతున్నారు, ఇందులో కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరవుతారు. కాగా స్వరా మాట్లాడుతూ.. తాను ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నందున ఆమె చాలా ట్రోలింగ్‌లను ఎదుర్కోవలసి వచ్చింది. భవిష్యత్తులో సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్‌లకు కూడా ఇదే గతి పడుతుందని ఆమె చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో, స్వర భాస్కర్ మాట్లాడుతూ.. ఇతర మతాలలో వివాహం చేసుకున్న జంటలను ట్రోలింగ్ చేయడం సాధారణం అని అంటుంది. లవ్ జిహాద్ అనేది భారతదేశంలో అతిపెద్ద సమస్య, ఇక్కడ ఒక హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిని వివాహం చేసుకుంటే నేరంగా భావిస్తున్నారు. ఇది నాకు కూడా వర్తిస్తుంది. అలాగే ఆమె మాట్లాడుతూ.. నా పెళ్లి సమయంలో కూడా చాలా మంది తమ అభిప్రాయాన్ని చెప్పారు.  చాలా మంది వారి వ్యక్తిగత జీవితంలో వారు ఏమి చేస్తారు.? వారు వివాహం చేసుకున్నారా.? లేదా.? అనేది పూర్తిగా వారిపైనే ఆధారపడి ఉంటుంది. పక్కవాళ్ళ మీద కాదు. పెళ్లి విషయంలో కూడా అంతే..  కలిసి జీవిస్తున్నా, కోర్టులో పెళ్లి చేసుకున్నా, ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నా ఎవరికీ సంబంధం లేదు. ఇది ఒక పురుషుడు, స్త్రీ అలాగే వారి కుటుంబానికి సంబందించిన విషయం. ఇది సోనాక్షి జీవితం. ఆమె తన భాగస్వామిని ఎంపిక చేసుకుంది. అలాగే అతని కూడా తన భాగస్వామిని ఎన్నుకున్నారు. ఇప్పుడు అది వారికి, వారి కుటుంబాల మధ్య ఉంది. ఇది సమయాన్ని వృధా చేసే చర్చగా నేను భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.