Sonu Sood: కరోనా సమయంలో ప్రేజల చేత దేవుడిగా కొలవబడ్డారు నటుడు సోనూసూద్. వేల మంది వలస కూలీలకు అండగా నిలబడి ఎంతో సాయం చేసాడు. కష్టం అన్నవారికి కాదనకుండా సాయం అందించాడు. దేశం మొత్తం సోను పై ప్రసంశలు కురిపించింది. ఇదిలా ఉంటే సోనూ సూద్ బుధవారం అమృత్ సర్ లోని ఓ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సోనూ సూద్ కరోనా వ్యాక్సిన్ ఎంత ముఖ్యమో తెలియజేసే విధంగా సంజీవని అనే వ్యాక్సినేషన్ డ్రైవ్ ని ప్రారంభించారు. కరోనా వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో చైతన్యం కలిగేలా, ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకునేలా ఈ డ్రైవ్ ఉండబోతోంది.
అనంతరం వ్యాక్సిన్ గురించి సోనూ సూద్ మాట్లాడుతూ… ”కరోనా వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం చాల ముఖ్యం అనిపించింది. అందుకే ఈ వ్యాక్సిన్ డ్రైవ్ ని ప్రారంభిస్తున్నాను. కొంతమంది ప్రజలు కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలా వద్దా అని ఇంకా ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరు తమ కుటుంబంలోని వృద్దులు కరోనా వ్యాక్సిన్ తీసుకునేలా చేయాలి. వారి ఆరోగ్యాలు కాపాడుకునేందుకు కరోనా వ్యాక్సిన్ చాల ఉపయోగపడుతుందని సోనూసూద్ తెలిపారు. పంజాబ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కోవిడ్ వ్యాక్షిన్ ను అందచెయ్యబోతున్నాము. గ్రామీణ ప్రజలు వ్యాక్షిన్ వేయించుకోవడానికి ఆలోచన చేస్తున్నారు కావున ఈరోజు అందరి ముందు వ్యాక్షిన్ వేయించుకోవడం జరిగిందని సోనూసూద్ తెలిపారు. త్వరలో పలు ఏరియాల్లో వ్యాక్షిన్ క్యాంపులు ప్రారంభిస్తున్నానని ఆయన అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
‘శాకుంతలం’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. సమంతకు ఇష్టసఖిగా రానున్న ఆ హీరోయిన్…