Singer KK Passes Away: కన్నుమూసిన ప్రముఖ బాలీవుడ్ సింగర్ కేకే.. లైవ్ షోలో గుండెపోటు..

Krishnakumar Kunnath Died: కోల్‌కతాలో నిర్వహించిన ఓ షో అనంతరం గాయకుడు కేకే గుండెపోటుతో మరణించారు.

Singer KK Passes Away: కన్నుమూసిన ప్రముఖ బాలీవుడ్ సింగర్ కేకే.. లైవ్ షోలో గుండెపోటు..
Singer Kk Death

Updated on: Jun 01, 2022 | 3:11 AM

బాలీవుడ్ ప్రముఖ హిందీ గాయకుడు కేకే(కృష్ణకుమార్ కున్నాత్) మంగళవారం కోల్‌కతాలో మరణించారు. ఓ లైవ్ షో తర్వాత అతను గుండెపోటుకు గురయ్యాడు. దీంతో వెంటనే కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కి తీసుకెళ్లారు. కేకేను పరిశీలించిన డాక్టర్లు రాత్రి 10:30 గంటలకు ఆయన చనిపోయినట్లు ప్రకటించారు. కేకే వయస్సు 53 సంవత్సరాలు. హిందీతో పాటు దక్షిణాది సినిమాల్లో 200కు పైగా పాటలు పాడారు. హమ్ దిల్ దే చుకే సనమ్ చిత్రంలో కూడా ఆయన తన గాత్రాని పంచుకున్నారు.

పంజాబీ గాయకుడు సిద్ధు ముసేవాలా హత్య తర్వాత సంగీత ప్రపంచంలో మరో విషాదం నెలకొంది. కేకే అసలు పేరు కృష్ణ కుమార్ కున్నాత్. ‘హమ్ దిల్ దిల్ దే చుకే సనమ్’ సినిమాలోని ‘ఐసా క్యా గుణ కియా’ పాటతో కేకే ఫేమస్ అయ్యాడు. కోల్‌కతాలోని వివేకానంద కళాశాలలో ఒక కార్యక్రమం జరిగింది. ఇదే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నటుడు అక్షయ్ కుమార్, గాయకుడు అర్మాన్ మాలిక్, నటి సోనాల్ చౌహాన్, మున్మున్ దత్తా సహా పలువురు ప్రముఖులు కేకే మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కేకే సార్ ఇక లేరంటే నమ్మలేకపోతున్నామని అర్మాన్ అన్నారు.

ఇవి కూడా చదవండి

విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ..

‘కేకే అనే ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ అకాల మరణం బాధాకరం’ అని ప్రధాని మోదీ అన్నారు. అతని పాటలు విస్తృతమైన భావోద్వేగాలను చిత్రీకరించాయి. అతని పాటలు అన్ని వయసుల వారితో ముడిపడి ఉన్నాయి. ఆయన్ని పాటల ద్వారా మనం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. కేకే కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.

సంతాపం వ్యక్తం చేసిన మనోజ్ తివారీ..

అదే సమయంలో, బాలీవుడ్ నటుడు మనోజ్ తివారీ కూడా KK మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ‘మీతో ఈ జ్ఞాపకం మరచిపోలేని ప్రయాణం. మీ పాటలు మాకు చిరస్థాయిగా నిలిచిపోతాయి. నిన్ను కోల్పోతాను KK. ఇది షాకింగ్‌గా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు.

మరిన్ని బాలీవుడ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..